Share News

Rains: మళ్లీ వర్షాలు..

ABN , Publish Date - Nov 26 , 2025 | 07:16 PM

నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ శ్రీలంక తదితర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కాస్తా.. తీవ్రంగా మారింది. మరికొన్ని గంటల్లో ఇది తీరం దాటుతుంది.

Rains: మళ్లీ వర్షాలు..

విశాఖపట్నం, నవంబర్ 26: నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ శ్రీలంక, భూమధ్యరేఖ హిందూ మహా సముద్రం పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా.. తీవ్రంగా మారింది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ బుధవారం విశాఖపట్నంలో వెల్లడించింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని తెలిపింది. రానున్న 48 గంటల్లో ఇది ఉత్తర పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు వద్ద తీరం దాటుతుందని పేర్కొంది.


ఈ నేపథ్యంలో నవంబర్ 29, 30 తేదీల్లో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలో వర్షాలు కురుస్తాయని వివరించింది. డిసెంబర్ 1వ తేదీన కోస్తాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతే కాకుండా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. చేపల వేటకు వెళ్ల వద్దని మత్స్యకారులకు సూచించింది. మలక్కా జలసంధి సమీపంలోని సెన్యార్ తుఫాన్ ఇండోనేషియా వద్ద తీరం దాటిందని వివరించింది. ఇది క్రమంగా బలహినపడుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించిన గ్రామస్తులు

బీసీలకు మోసం జరుగుతుంటే.. బీఆర్ఎస్ నుంచి నో రియాక్షన్: కవిత

For More AP News And Telugu News

Updated Date - Nov 26 , 2025 | 07:30 PM