CM Chandrababu: ‘ముస్తాబు’ ఓ మంచి కార్యక్రమం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:25 PM
ముస్తాబు మంచి కార్యక్రమం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా తాళ్లపాలెం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలకు సీఎం చేరుకుని.. విద్యార్థినిలతో మాట్లాడారు.
అనకాపల్లి, డిసెంబర్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Nanidu) జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా తాళ్లపాలెం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకున్న సీఎం.. అక్కడి విద్యార్థినులతో మాటామంతి నిర్వహించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ముస్తాబు కార్నర్‌ను పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అల్లూరి జిల్లా కలెక్టర్ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని తెలిపారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా కొత్త విధానం తెచ్చారన్నారు. మంత్రి నారా లోకేష్, అలాగే మంత్రులు మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారని అన్నారు. పిల్లల బంగారు భవిష్యత్ బాధ్యత తనది అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇక విద్యార్ధినిలతో మాటామంతిలో భాగంగా సీఎం ముందు విద్యార్థిని గుణ శ్రీవల్లి మాట్లాడింది. ముస్తాబు కార్యక్రమం చాలా మంచి కార్యక్రమని. పరిశుభ్రత పెంపోందించే కార్యక్రమమని పేర్కొంది. సొషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపాల్ కావాలని ఉందని ఈ సందర్భంగా శ్రీవల్లి తన గోల్‌ను సీఎం ముందు తెలియజేసింది.
కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ముస్తాబు కార్యక్రమం నేటి నుంచే అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విద్యార్ధుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన పెంచేలా ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కూడా దీనిని అమలు చేసేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
ఇవి కూడా చదవండి...
శ్రీశైలంలో ఇవి చేయొద్దు.. చర్యలు తప్పవు.. ఈవో కీలక ఆదేశాలు
ఇకపై అన్ని స్కూళ్లల్లో ‘ముస్తాబు’.. సర్కార్ ఉత్తర్వులు జారీ
Read Latest AP News And Telugu News