Share News

CM Chandrababu: ఆయన పుస్తకం రాస్తారని ఎప్పుడూ అనుకోలేదు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Mar 06 , 2025 | 01:20 PM

దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకం ఆవిష్కరణ గురువారం విశాఖలోని గీతం యూనివర్సిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులు హాజరయ్యారు.

CM Chandrababu: ఆయన పుస్తకం రాస్తారని ఎప్పుడూ అనుకోలేదు: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

విశాఖ: దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswararao) ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారని.. ఆయన పుస్తకం (B00k) రాస్తారని ఎప్పుడూ అనుకోలేదని.. వెంకటేశ్వరరావులో ఇంత డెప్త్‌ (Depth) ఉందని తెలియదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలోని గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం (World History Book Launch) జరిగింది. సీఎం చంద్రబాబు (CM Chandrababu), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu), కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman), బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeshwari) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తమ కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి అని, ఇద్దరం కలిసి ఎన్టీఆర్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నామని, ఆయన అప్పజెప్పిన బాధ్యతలు నెరవేర్చేవాళ్లమి చెప్పారు. కలిసి 40 ఏళ్లు ఉన్నామని.. ఆయనలో ఇంత డెప్త్ ఉందని.. పుస్తకం రాస్తారని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు.

Read More News..:

ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యం అదే..: నారా భువనేశ్వరి


దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక డాక్టరని.. ఆయన లైఫ్‌ను చాలా బాగా గడుపుతారని, ఆయన డాక్టర్ ప్రాక్టీస్ చేయకుండా సీనిమాలు తీశారని.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, మంత్రిగా పనిచేశారని, ఒకసారి లోక్ సభ, మరోకసారి రాజ్యసభ మెంబర్‌గా ఉన్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇప్పటి వరకు ఆయన ఐదు పుస్తకాలు రాశారన్నారు. మొదటిది ‘చరిత్రలో కొన్ని నిజాలు’ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ‘ఏర్పాటు వాదం ఎందుకొచ్చింది’ పుస్తకం రాశారని.. మూడో పుస్తకం.. ‘ప్రపంచ తత్వం.. నాయకత్వం’ రాశారన్నారు. నాలుగోది.. ‘ప్రపంచ దేశాలు..పాలనా వ్యవస్థలు’ రాశారు. ఇప్పుడు ‘ప్రపంచ చరిత్ర’ ఆది నుంచి నేటి వరకు పుస్తకం రాశారని చంద్రబాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జయశంకర్ లండన్ పర్యటనలో కలకలం..

రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 06 , 2025 | 01:59 PM