AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
ABN , Publish Date - Oct 10 , 2025 | 05:01 PM
గడిచిన 15 నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సుకు అనేక పాలసీలు ఇచ్చామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వివిధ పాలసీలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇచ్చి రూ.1.17లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ మేరకు ఇవాళ (శుక్రవారం) సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంపై మంత్రి మాట్లాడారు. ఇవాళ జరిగిన క్యాబినెట్ మీటింగ్ రాష్ట్ర ఆర్థిక పురోగతి, ఏఐ అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఎస్‌ఐపీబీ మీటింగ్‌లో చర్చించిన నిర్ణయాలకూ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు స్పష్టం చేశారు.
గడిచిన 15 నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సుకు అనేక పాలసీలు ఇచ్చామని కొలుసు పార్థసారథి తెలిపారు. వివిధ పాలసీలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇచ్చి రూ.1.17లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సుమారు 70 వేల ఉద్యోగాలు వచ్చేలా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. అలాగే టాటా పవర్ రెన్యూవబుల్ లిమిటెడ్ ప్లాంటు, చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
తోటపల్లి బ్యారేజి నుంచి 24 ఎంసీఎం నీటిని ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. దీనితో పాటు ఎవాపరేషన్ లాసెస్‌కూ నీటిని కేటాయించినట్లు తెలిపారు. రిలయన్స్ కన్సూమర్ ప్రాడెక్ట్‌ల కింద కర్నూలు జిల్లాలో రూ.758 కోట్లతో ప్యాక్టరీ నెలకొల్పడానికి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. టూరిజం పాలసీ ఒక గేమ్ ఛేంజర్ అందుకే దానిపై కేబినెట్ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు చెప్పుకొచ్చారు. దాని కోసం ప్రత్యేకమైన ల్యాండ్ పార్సిల్స్ ఏర్పాటు చేయలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..