Tungabhadra water: జనవరి 10 వరకు తుంగభద్ర నీరు..
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:06 PM
తుంగభద్ర జలాశయం నుంచి పంట కాలువలకు జనవరి 10వ తేదీ వరకు నీరు వదిలేలా ఐసీసీ సమావేశంలో నిర్ణయించారు. పంట కోతలు పూర్తయ్యే వరకు వదలాలని తీర్మానించారు. శనివారం బెంగళూరులోని నీటిపారుదల శాఖ భవనంలో జలవనరుల శాఖ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఐసీసీ కమిటీ చైర్మన్ మంత్రి శివరాజ్ తంగడిగే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
- తరువాత క్రస్ట్‌గేట్లు అమర్చే పనులు
- రబీకి మొండిచెయ్యిఫ ఐసీసీ సమావేశంలో తీర్మానం
బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) నుంచి పంట కాలువలకు జనవరి 10వ తేదీ వరకు నీరు వదిలేలా ఐసీసీ సమావేశంలో నిర్ణయించారు. పంట కోతలు పూర్తయ్యే వరకు వదలాలని తీర్మానించారు. శనివారం బెంగళూరులోని నీటిపారుదల శాఖ భవనంలో జలవనరుల శాఖ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar), ఐసీసీ కమిటీ చైర్మన్ మంత్రి శివరాజ్ తంగడిగే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
తుంగభద్ర బోర్డులోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్(Karnataka, Andhra Pradesh) రాష్ట్రాల ఇంజనీర్లు, బోర్డు చైర్మన్‌తోపాటు బళ్లారి, సిరుగుప్ప, కంప్లి, కొప్పళ, విజయనగర, రాయచూరు ఎమ్మెల్యేలు, మంత్రులు నాగేంద్ర, గణేష్, బోసురాజు, రాఘవేంద్ర హిత్నాల్, రైతు సంఘం నాయకులు హాజరయ్యారు. తుంగభద్ర జలాశయంలో శుక్రవారానికి 75.989 టీఎంసీల నీరు నిల్వ ఉందనీ, ప్రసుత్తం డ్యాం ఆయకట్టులో పంటను కాపాడేందుకు నీటిని వినియోగించేలా తీర్మానించారు.

జనవరి నాటికి డ్యాం పరిధిలో ఉండే అన్ని కాలువలకు నీరు వదలాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటివరకూ ఆంధ్ర కోటా కింద దిగువ, ఎగువ కాలువలకు వదిలిన నీరు.. ఇంకా ఇవ్వాల్సిన దానికి సంబంధించి లెక్కలు వేశారు. సమావేశంలో రైతు సంఘం నాయకుడు.. రబీ పంటలకు నీరు వదలాలని కోరారు. దీనిపై డిప్యూటీ సీఎం, జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. జనవరి 10 వరకూ అన్ని కాలువలకు నీరు వదులుతామన్నారు.

తరువాత తాగునీటి కోసం నిల్వ చేస్తామన్నారు. క్రస్ట్ గేట్లు అమర్చే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. డ్యాం భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రైతులు, రైతు సంఘం నాయకులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. డ్యాంలో నీరు అలాగే ఉంచితే క్రస్ట్ గేట్లు ఆమర్చడం సాధ్యం కాదన్నారు. ఈసారి క్రస్ట్ గేట్లు ఆమర్చకపోతే వచ్చేఏడాది జలాశయానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున జనవరి నాటికి నీరు వదిలేసి, క్రస్ట్ గేట్లు అమర్చుతామని తేల్చిచెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక
Read Latest Telangana News and National News