Share News

Tirumala: కూరగాయల దాతలతో వాట్సాప్‌ గ్రూపు..

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:25 PM

అన్నప్రసాదాలకు కూరగాయలు విరాళంగా టీటీడీ(TTD)కి అందజేస్తున్న దాతలతో ఒక వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. కూరగాలయ దాతలతో బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆయన సమావేశమయ్యారు.

Tirumala: కూరగాయల దాతలతో వాట్సాప్‌ గ్రూపు..

- టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచన

- బ్రహ్మోత్సవాల్లో రోజుకు పది టన్నులు అవసరం

తిరుమల: అన్నప్రసాదాలకు కూరగాయలు విరాళంగా టీటీడీ(TTD)కి అందజేస్తున్న దాతలతో ఒక వాట్సాప్‌ గ్రూపు(WhatsApp Group) ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. కూరగాలయ దాతలతో బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల అన్నప్రసాద విస్తరణ చేసిన నేపథ్యంలో దాతలు మరింత ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.


nani5.jpg

ప్రస్తుతం దాతలు రోజుకు 25 రకాల కూరగాయలు, 6 నుంచి 7 టన్నులు అందజేస్తున్నారని, బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 10 టన్నులు అవసరముంటుందని అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్రకుమార్‌, క్యాటరింగ్‌ ఆఫీసర్‌ శాస్ర్తి వివరించారు. కూరగాయల విరాళాలు 2022లో 5.79 శాతం నుంచి 2025లో దాదాపు 7 శాతానికి పెరిగాయని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీకి చెందిన కూరగాలయ దాతలను వెంకయ్య చౌదరి శ్రీవారిప్రసాదాలతో సత్కరించారు.


nani5.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

సీఎం రేవంత్‌ ఇంటి ప్రహరీ కూల్చివేత

Read Latest Telangana News and National News

Updated Date - Sep 10 , 2025 | 12:28 PM