Share News

Breaking News: నా రాజీనామాతో కూటమికే లాభం.. తెలిసే రాజీనామా చేశా..

ABN , First Publish Date - Jan 25 , 2025 | 11:33 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: నా రాజీనామాతో కూటమికే లాభం.. తెలిసే రాజీనామా చేశా..
Breaking News

Live News & Update

  • 2025-01-25T12:51:09+05:30

    మీడియాతో చంద్రబాబు..

    • దావోస్ తనకు కొత్త కాదన్న చంద్రబాబు

    • దావోస్ వెళ్లాలని తొలుత తాను నిర్ణయం తీసుకున్నా

    • 1995 లో మొదట దావోస్‌కి వెళ్ళాను

    • అప్పటిలో హైదరాబాద్ అంటే పాకిస్థాన్ లోని హైదరాబాదా అని అడిగేవారు

    • అప్పట్లో హైదరాబాద్ లో సరైన విమానాశ్రయం లేదు

    • అప్పట్లో రాజకీయ నాయకులు దావోస్ వచ్చేవారు కాదు.

    • బెంగళూరు నుంచి అప్పటి కర్ణాటక సీఎం SM కృష్ణ వచ్చేవారు

    • విద్వంసానికి గురైన ఏపీని ప్రమోట్ చేసేందుకు ప్రతి వేదికను ఉపయోగించుకుంటున్నాను

  • 2025-01-25T11:45:29+05:30

    రాజీనామాపై విజయసాయిరెడ్డి

    • వ్యక్తిగత కారణాలతోనే ఎంపీ పదవికి రాజీనామా

    • వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాలనుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా

    • రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు

    • జగన్ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులు

    • నాలాంటివాళ్లు వెయ్యిమంది పార్టీ వీడినా జగన్ ప్రజాదరణ తగ్గదన్న విజయసాయిరెడ్డి

    • రాజకీీయాలనుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత లండన్‌లో ఉన్న జగన్‌తో ఫోన్‌లో మాట్లాడా

    • జగన్‌కు అన్ని విషయాలు వివరించిన తర్వాత రాజీనామా సమర్పించాను

    • భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడను

    • బీజేపీలో చేరిదిలేదని తేల్చిచెప్పిన విజయసాయిరెడ్డి

    • హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా అసత్యాలు చెప్పను

    • జగన్‌తో ఎలాంటి విబేధాలు లేవు

  • 2025-01-25T11:33:39+05:30

    రాజీనామాపై మీడియాతో విజయసాయి..

    • ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా

    • ఢిల్లీలో మీడియాతో మాట్లాడనున్న విజయసాయి

    • రాజీనామాపై మరిన్ని విషయాలు వెల్లడించే అవకాశం

    • రాజకీీయాలకు దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించిన విజయసాయి