-
-
Home » Andhra Pradesh » Today Breaking News Maha Kumbh 2025 Latest Telugu News Updates Chandrababu Delhi Tour Delhi Elections bc caste census in telangana and Latest Telugu News Monday 3rd February 2025 Amar
-
Breaking News: మస్తాన్ సాయి వద్ద హార్డ్ డిస్క్.. 40 ప్రయివేట్ వీడియోలు.. లావణ్యది కూడా..
ABN , First Publish Date - Feb 03 , 2025 | 01:33 PM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-02-03T16:24:14+05:30
హార్డ్ డిస్క్‌లో 40కి పైగా ప్రయివేట్ వీడియోలు
లావణ్య, రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు
లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పై మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు
రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణమే మస్తాన్ సాయి అంటూ ఫిర్యాదులు పేర్కొన్న లావణ్య
పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు
ప్రైవేట్‌గా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు
లావణ్య కు చెందిన కొన్ని వీడియోలను రికార్డ్ చేసిన మస్తాన్ సాయి
మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను పోలీసులకు అందజేసిన లావణ్య
మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200 వీడియోలకు పైగా ఉన్నట్లు గుర్తింపు
-
2025-02-03T14:26:18+05:30
తెలంగాణలో బీసీ కుల గణనపై అనుమానాలు: ఆర్ కృష్ణయ్య
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కులాల జనాభా లెక్కలు తప్పుల తడకలుగా ఉన్నాయి
గతంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ సమగ్రసర్వే చేశారు..
ఆ జనాభాలో 52 శాతం బిసిలు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 42 శాతానికి తగ్గించారు
బీసీ రిజర్వేషన్లు దెబ్బతీసే విధంగా వ్యవహరించారు
సరిగ్గా సర్వే చేయడం లేదని ముందే చెప్పాను
హైదరాబాద్ లో ఇంటింటి సర్వే నిర్వహించలేదు
ఏడు శాతం బీసీ జనాభా లెక్కలు తక్కువగా చూపించారు
దీనిపై ఉన్నత సాయి సమీక్ష సమావేశం నిర్వహించాలి
కేసీఆర్ సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు ఇంటింటికి తిరిగి లెక్కలు తీసుకున్నారు
ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉంచుకునే విధంగా సర్వేను కుదించారు
ప్రభుత్వం మళ్ళీ జనాభా కుల గణన సర్వే చేయాలి
అగ్రకులాల జనాభా 7శాతానికి ఏ విధంగా పెరిగింది
బీసీలను అణిచివేసే కుట్రలో భాగంగా జనాభా లెక్కలు తక్కువగా చూపించారు
సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించాలి
-
2025-02-03T13:52:56+05:30
నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
సినీ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
గోవాలో ఆత్మహత్య
గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి
వరలక్ష్మి టిఫిన్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా కేపీ చౌదరి
చాలా మంది సినీ సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లు ఆరోపణలు
ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం
-
2025-02-03T13:33:27+05:30
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ, గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ఇవాల్టి నుంచి ప్రారంభమైన నామినేషన్లు
ఫిబ్రవరి 3 నుండి 10 తేది వరకు నామినేషన్ల స్వీకరణ
11వ తేదిన నామినేషన్ల పరిశీలన
13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ
27న పోలింగ్
మార్చి 3న కౌంటింగ్
కూటమి బలపర్చిన అభ్యర్థిగా ఆలపాటి రాజా
పిడిఎఫ్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు
ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా వైసిపి