Share News

Devaragattu Banni Utsavam: కర్రలతో కొట్టుకున్న భక్తులు.. ఇద్దరు మృతి, 100మందికి పైగా గాయాలు

ABN , Publish Date - Oct 03 , 2025 | 06:11 AM

కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు గురువారం రాత్రి రక్తసిక్తంగా మారింది. బన్ని ఉత్సవం సందర్భంగా అర్ధరాత్రి అమ్మవారి వివాహం, ఊరేగింపు మొదలైంది. అయితే ఈ సందర్భంగా దేవతామూర్తులను తీసుకెళ్లే విషయంలో భక్తుల మధ్య పోటీ మొదలైంది.

 Devaragattu Banni Utsavam: కర్రలతో కొట్టుకున్న భక్తులు.. ఇద్దరు మృతి, 100మందికి పైగా గాయాలు

కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు గురువారం రాత్రి రక్తసిక్తంగా మారింది. బన్ని ఉత్సవం సందర్భంగా అర్ధరాత్రి అమ్మవారి వివాహం, ఊరేగింపు మొదలైంది. అయితే ఈ సందర్భంగా దేవతామూర్తులను తీసుకెళ్లే విషయంలో భక్తుల మధ్య పోటీ మొదలైంది. ఎలాగైనా దేవతామూర్తులను తమ ప్రాంతానికే తీసుకెళ్లాలని రెండు వర్గాలు కర్రలతో ఘర్షణకు దిగాయి. ఈ సందర్భంగా భక్తులంతా రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్నారు. ఈ గొడవలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 100 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు.


దేవరగట్టులో బన్ని ఉత్సవం ప్రతి ఏటా నిర్వహించడం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా దేవతామూర్తులను కాపాడేందుకు మూడు గ్రామాల భక్తులు ఒకవైపు, ఏడు గ్రామాల భక్తులు మరోవైపు నిలబడి కర్రలతో కొట్టుకుంటున్నారు. ఈ సమరాన్ని చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివస్తుంటారు. ఈ ఉత్సవం సందర్భంగా దేవతామూర్తులను కాపాడటానికి భక్తులు కర్రలతో కొట్టుకోవడం సాంప్రదాయంగా వస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

దసరా వేళ విషాదం.. పూజ చేస్తూ కుప్పకూలిన పూజారి..

ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్

For More AP News And Telugu News

Updated Date - Oct 03 , 2025 | 09:07 AM