Mahanadu 2025: ఈ ఏడాది ‘మహానాడు’ ఎక్కడంటే..?
ABN , Publish Date - Jan 31 , 2025 | 08:20 PM
Mahanadu 2025: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహంచే మహానాడును ఈ ఏడాది కడప వేదికగా నిర్వహించాలని నిర్ణమయించారు. గతంలో రాజమండ్రి వేదికగా ఈ మహానాడు నిర్వహించిన సంగతి తెలిసిందే.

అమరావతి, జనవరి 31: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం.. ఈ ఏడాది కడపలో నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మహానాడు కార్యక్రమం అనంతరం కేంద్ర, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తు్న్నారు. శుక్రవారం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సభ్యుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఆ క్రమంలో వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో తగ్గిన బీసీ కోటా రిజర్వేషన్లు పునరుద్దరించేందుకు చట్టపరమైన అంశాలు పరిశీలించాలని ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులకు సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే జిల్లాల పునర్విభజనపై సైతం కీలక చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనకు సంబంధించిన పొరపాట్లను సరిదిద్దాలని పలువురు నేతలు సీఎం చంద్రబాబుకు సూచించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
Also Read : రాష్ట్రపతి ప్రసంగంపై స్పందించిన సోనియా.. బీజేపీ మండిపాటు
వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్లే ఎఫ్ఆర్‌బీఎం లిమిట్ సున్నా అయిందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి రూ. ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినా.. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read : దేవాలయాల్లో వీఐపీ దర్శనాలు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
2014-19 మధ్య రాష్ట్రంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకూడదని ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని ఆయన ఆకాంక్షించారు. అన్నదాత సుఖీభవ కేంద్రం రూ. 6 వేలు ఇచ్చినా మిగిలిన రూ.14 వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరించి 3 విడతల్లో రూ. 20 వేలు చెల్లిద్దామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Also Read : దమ్ముంటే అక్కడికి రా.. నువ్వో నేనో చూసుకుందాం..
రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలు కోసం ఆన్వేషిస్తున్నట్లు చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు నిధులు పీపీపీ మోడల్‌లో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం, కాంట్రాక్టర్లు 50 శాతం పెట్టుకునేలా ప్రణాళికలు సిద్ధం చేద్దామన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే 50 శాతం నిధుల్లో సగమైనా కేంద్రాన్ని అడుగుదామని ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
Also Read : ‘ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది’
ప్రతి రెండేళ్లకు ఒకసారి మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోంది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మదినమైన మే 28 వ తేదీన ప్రారంభమై రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. 2023లో రాజమండ్రి వేదికగా ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. 2025లో మహానాడు కార్యక్రమాన్ని కడపలో నిర్వహించనున్నారు.
Also Read : సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురు.. అసలు విషయం ఏమిటంటే..?
2024 మే, జూన్ మాసాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా కలిసి పోటీ చేశాయి. దీంతో 164 స్థానాలను కూటమి కైవసం చేసుకొంది. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తిరింది. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన అనంతరం జరుగుతోన్న తొలి మహనాడు కడప వేదికగా జరుగుతోంది.
For AndhraPradesh News And Telugu News