MLC Elections: వీడిన ఉత్కంఠత.. అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
ABN , Publish Date - Mar 09 , 2025 | 08:02 PM
MLC Elections: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ముగ్గురిని ఎంపిక చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ సైతం ప్రారంభం కావడంతో.. ముగ్గురు పేర్లను పార్టీ ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగు వేసినట్లు స్పష్టమవుతోంది.
అమరావతి, మార్చి 09: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు అభ్యర్థుల పేర్లను తెలుగు దేశం పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ, బీదా రవిచంద్రతోపాటు బీటీ నాయుడు పేర్లను ఆదివారం సాయంత్రం ఆ పార్టీ ప్రకటించింది. ఈ ముగ్గురు పేర్లను ఎంపిక చేయడంలో.. ఆ పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసిందని తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలో దిగేందుకు ఆశావహుల సంఖ్య భారీగా ఉంది.
Also Read : బీజేపీని వరించిన అదృష్టం.. టీడీపీలో ఆ నలుగురిని కాదని..
దీంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. 2027లో మరోమారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయిని.. వాటిలో ఛాన్స్ ఇస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పమన్నారంటూ ఆశావహులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా ఫోన్ చేసి వివరించారు. ఆ కొద్ది సేపటికే పార్టీ అధిష్టానం ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
Also Read : ఈ సమయంలో చైన్ లాగితే.. రైలు ప్రయాణంలో జరిమానా విధించరు.. ఎందుకో తెలుసా?
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతీ కుమార్తె కావలి గ్రీష్మ. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్రతోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన బీటీ నాయుడులకు ఎంపిక చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల నుంచి ముగ్గురిని ఎంపిక చేసినట్లు అయింది.
Also Read: మెడికోకి బెదిరింపు.. నిందితుల కోసం గాలింపు
మరోవైపు మార్చి 20వ తేదీన ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక కూటమిలోని మిత్ర పక్షాలైన బీజేపీ, జనసేనకు రెండు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించారు. జనసేన నుంచి ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు కేటాయించారు. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో నామినేషన్ సైతం దాఖలు చేశారు. ఇక బీజేపీకి చివరి నిమిషంలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఉత్కంఠత నెలకొంది.
Also Read: బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?
ఇంకోవైపు అభ్యర్థి ఎంపికపై ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కసరత్తు చేస్తున్నారు. ఆ క్రమంలో ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు మాజీ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర బీజేపీ నేత మాధవ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరు జాక్ పాట్ కొట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికపై పార్టీ అధినేత్రి పురందేశ్వరి.. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతోన్నారు. దీంతో అభ్యర్థి ఎవరనేది ఈ రోజు రాత్రి లేకుంటే సోమవారం ఉదయం ఖరారు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ
For AndhraPradesh News And Telugu News