MLC Elections: బీజేపీని వరించిన అదృష్టం.. టీడీపీలో ఆ నలుగురిని కాదని..
ABN , Publish Date - Mar 09 , 2025 | 07:02 PM
MLC Elections: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. తెలుగుదేశం పార్టీలో ఆశావహుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా రంగంలోకి దిగారు.
అమరావతి, మార్చి 09: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో టీడీపీలో ఎమ్మెల్సీ ఆశావహా అభ్యర్థులు సంఖ్య భారీగా పెరిగింది. ఈ టికెట్ పొందేందుకు ఎవరికి వారు.. తమ మార్గంలో తమ వంతు ప్రయత్నాలు ఇప్పటికే ముమ్మరం చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీ ఆశావహ అభ్యర్థులకు పార్టీ హైకమాండ్ నుంచి వరుసగా ఫోన్లు వెళ్తున్నాయి. ఆ క్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు.. స్వయంగా రంగంలోకి దిగి.. ఈ సారి టికెట్ ఇవ్వలేక పోతున్నామంటూ పలువురు నేతలకు స్వయంగా ఫోన్ చేసి పరిస్థితిని వివరిస్తున్నారు. 2027.. కోటాలో అవకాశం కల్పిస్తామని పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పమన్నారంటూ సదరు ఆశావహులకు ఫోన్‌లో పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేస్తున్నారు.
Also Read : ఈ సమయంలో చైన్ లాగితే.. రైలు ప్రయాణంలో జరిమానా విధించరు.. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతోన్నాయి. వీటికి మార్చి 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని జనసేన పార్టీకి చెందిన నాగబాబుకు టీడీపీ కేటాయించింది. మరో ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. చివరి నిమిషంలో తమకు ఓ సీటు కేటాయించాలని బీజేపీ హైకమాండ్ పట్టు బట్టింది. దీంతో ఓ స్థానాన్ని ఆ పార్టీకి టీడీపీ కేటాయించింది. ఈ స్థానాన్ని బీజేపీలో ఎవరికిస్తారనే అంశంపై తీవ్ర చర్చ కొనసాగుతోంది.
Also Read: మెడికోకి బెదిరింపు.. నిందితుల కోసం గాలింపు
ఇక మిగిలిన మూడు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడితోపాటు ఆ పార్టీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. అయితే పిఠాపురం నుంచి గతంలో గెలుపొందిన వర్మకు ఈ సారి నో టికెట్ అని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే టీడీ జనార్దన్, డి, రామారావు, పి. అశోక్ బాబు, పార్టీ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ మాల్యాద్రితోపాటు మాజీ మంత్రి కె.ఎస్. జవహర్‌కు సైతం ఈ సారికి సారి అంటూ స్పష్టం చేసినట్లు ఓ చర్చ అయితే సాగుతోంది. మరోవైపు మూడు స్థానాలు ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠత పార్టీలో నెలకొంది.
Also Read: బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టాడు. దీంతో కూటమి 164 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అయితే బీజేపీ, జనసేనతో టీడీపీ కలిసి వెళ్తోంది. దీంతో ఆ పార్టీ మిత్ర ధర్మం పాటిస్తోంది. ఆ క్రమంలో జనసేన, బీజేపీకి ఒక్కో స్థానాన్ని కేటాయించి.. మిగిలిన మూడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలపనుంది. ఆ అభ్యర్థుల ఎవరినేది ఒకటి రెండు రోజుల్లో తెలిపోనుంది. మరోవైపు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం జరుగుతోన్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ఇవి ప్రాధాన్యత సంతరించుకొంది.
Also Read: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ
అంతేకాదు.. గత జగన్ ప్రభుత్వ హయాంలో సైతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సైతం టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పంచుమర్తి అనురాధా అనుహ్యంగా విజయం సాధించారు. దీంతో నాటి జగన్ ప్రభుత్వం.. తన పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం విధితమే. ఇంకోవైపు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలప లేదు. ఓ వేళ నిలిపినా.. గెలుపు దక్కదనే విషయం ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సుస్పష్టంగా తెలుసన్న సంగతి అందరికి తెలిసిందే.
For AndhraPradesh News And Telugu News