Raghurama Krishnam Raju: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకు సుప్రీంలో ఊరట..
ABN , Publish Date - Aug 25 , 2025 | 01:13 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనపై హైదరాబాద్‌లో దాఖలైన ఎఫ్ఐఆర్ కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై కానిస్టేబుల్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఫరూక్ బాషా అనే కానిస్టేబుల్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను సోమవారం సుప్రీం ధర్మాసనం కొట్టివేస్తున్నట్లు తీర్పువెలువరించింది. రఘురామ, అతడి కార్యాలయ సిబ్బంది దాడి చేశారంటూ కొన్నేళ్ల కిందట కేసు వేసిన పిటిషనర్ ఫరూక్.. ఈ కేసును తాను కొనసాగించుకోదలచుకోవడం లేదంటూ అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ జెకే మహేశ్వరి ధర్మాసనం ఈ కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.
కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్‌లోని రఘురామకృష్ణరాజు నివాసం వద్ద ఎస్‌కే ఫరూక్ బాషా అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. ఆయన భద్రతా సిబ్బంది పిలిచి విచారించారు. ఐడీ, ఆధార్ కార్డులు చూపించమని అడగ్గా ఫరూక్ అందుకు నిరాకరించాడు. దీంతో అనుమానం వచ్చి గచ్చిబౌలి పోలీసులకు అప్పగించి రఘురామ పీఏ ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఫరూక్ బాషా ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అని తేలింది. ఆ తర్వాత విధి నిర్వహణలో ఉన్న తనపై నలుగురు వ్యక్తులు దాడి చేశారంటూ.. ఎంపీ రఘురామ కృష్ణరాజుతోపాటు మరో నలుగురిపై ఫరూక్ బాషా కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం తనతో పాటు తన కుమారుడు, మరో ఇద్దరిపై నమోదైన కేసును క్వాష్ చేయాలని రఘరామ హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ 12 జూలై 2022న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఎంపీగా ఉన్నానని, అప్పటి సీఎం వైఎస్ జగన్‌తో ఘర్షణలు ఉన్న కారణంగా వై కేటగిరీ భద్రత ఉండేదన.. అందుకే అనుమానాస్పదంగా తిరుగాడుతున్న వ్యక్తిని సందేహంతో ప్రశ్నిస్తే ఇదంతా జరిగిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అదీగాక, ఇటీవల ఫరూక్ సైతం ఏపీకి, హైదరాబాద్ కు 400 కిలోమీటర్ల దూరం ఉన్న కారణంగా పిటిషన్ ఉపసంహరించుకోవాలని ముందుకొచ్చిన నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం కేసును కొట్టివేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల నిర్లక్ష్యం.. అనంతబాబు కేసుతో తలనొప్పి
ఫోనే కీలకం.. వారిలో మొదలైన అలజడి..!
For More AP News And Telugu News