Aster Ramesh Hospitals : గుండె పరీక్షల్లో సీటీ ఎఫ్ఎఫ్ఆర్
ABN , Publish Date - Feb 03 , 2025 | 04:43 AM
ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహకారంతో నూతనంగా సీటీ ఎఫ్‌ఎ్‌ఫఆర్ టెక్నాలజీని దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చామని ఆస్టర్ రమేశ్ హాస్పిటల్స్

ఏఐ సహకారంతో కొత్త పరీక్ష అందుబాటులోకి..
ఆస్టర్ రమేశ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ రమేశ్‌బాబు
విజయవాడ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): శరీరంలో కీలకమైన గుండె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహకారంతో నూతనంగా సీటీ ఎఫ్‌ఎ్‌ఫఆర్ టెక్నాలజీని దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చామని ఆస్టర్ రమేశ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పోతినేని రమేశ్‌బాబు వెల్లడించారు. ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌లో ఇదొక నూతన అధ్యాయమని పేర్కొన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు గుండెకు ఉన్న ముప్పును గుర్తించడానికి ఈసీజీ, ఎకో, ట్రెడ్‌మిల్ వంటి పరీక్షలపై ఆధారపడాల్సి వస్తోందని, ప్రాథమికంగా రోగ నిర్ధారణ కోసం కాల్షియం స్కోర్, సీటీ యాంజియోగ్రామ్ పరీక్షలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. కానీ... ఇప్పుడు టెక్నాలజీతో విప్లవాన్ని సృష్టిస్తున్న ఏఐ, రికరెంట్, మల్టీలేయర్డ్ డీప్ న్యూరల్ నెట్‌వర్క్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటివి గుండె, మెదడు, కేన్సర్, జన్యు, సింగిల్ సెల్ అట్లాస్ వంటి అంశాలపై హై రిజల్యూషన్ ఇమేజింగ్ ద్వారా కచ్చితమైన రోగ నిర్ధారణను తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...
Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం
Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News and Telugu News