Robbery Gang: ఈ దొంగల ప్లాన్ తెలిస్తే హడలే.. మరి ఇంతలా తెగించారే..
ABN , Publish Date - Jan 30 , 2025 | 05:12 PM
Robbery Gang: ప్రకాశం జిల్లాలో జరిగిన దొంగతనం షాకింగ్‌కు గురిచేస్తోంది. దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. జూమ్ యాప్ ద్వారా కార్లు బుక్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరి దొంగతనం తెలిసి పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే నిందితులను పట్టుకుని దొంగల ఆట కట్టించారు.

ప్రకాశం: ప్రకాశం జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. పోలీసులకు తెలియకుండా కార్లను దొంగిలించారు. ఈ కార్లను గుట్టుచప్పుడు కాకుండా తరలించేలా ఏర్పాటు చేశారు. అనుకున్నదే తడవుగా ఈ కార్లను ఎవరికి కనపడకుండా తరలించేలా ఓ కంటైనర్‌ను ఎంచుకున్నారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాలోని జరుగుమల్లి మండలం బిట్రగుంట జాతీయ రహదారిపై కార్లను దొంగతనం చేశారు. దొంగతనం చేసిన కార్లను కంటైనర్‌లో తీసుకెళ్తున్నలారీని హైవే పోలీసులు పట్టుకున్నారు.
ఆ లారీని పోలీసులు చేజ్ చేసి మరి పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు వారి స్టైల్‌లో విచారణ చేపట్టారు. ఈ విచారణలో నిందితులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. హైదరాబాద్‌లో జూమ్ యాప్ ద్వారా కార్లను బుక్ చేసుకొని వాటిని దొంగలించి కంటైనర్‌లో చెన్నై వైపు తరలిస్తున్నట్లు తెలిపారు. ఆ కార్లను తరలిస్తున్నదొంగలను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌కు తెలంగాణ పోలీసులు సమాచారం ఇచ్చారు. జీపీఎస్ ఆధారంగా సింగరాయకొండ పోలీసులను ఎస్పీ దామోదర్ అలర్ట్ చేశారు. కంటైనర్‌ను బిట్రగుంట వద్ద పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్‌లో ఉన్న మూడు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన స్థానికులు దొంగలు మరీ ఇంతలా రెచ్చిపోయారేంటో అనుకుని నోరెళ్లబెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News