Share News

Shocking incident in Regulagadda: ఇంట్లోంచి పెద్దగా అరుపులు.. లోపలికెళ్లి చూడగా షాక్..

ABN , Publish Date - Sep 13 , 2025 | 05:29 PM

ఉమ్మడి ప్రకాశం జిల్లా మరిపూడి మండలం రేగులగడ్డ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆర్థరాత్రి వేళ.. ఇంట్లో నుంచి బిగ్గరగా అరుపులు వినిపించాయి. దీంతో స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు.

Shocking incident in Regulagadda: ఇంట్లోంచి పెద్దగా అరుపులు.. లోపలికెళ్లి చూడగా షాక్..
Shocking incident in Regulagadda

ఒంగోలు, సెప్టెంబర్ 13: భార్యపై అనుమానం పెంచుకుని.. ఆమెను దారుణంగా హత్య చేసి.. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ప్రకాశం జిల్లా మరిపూడి మండలం రేగులగడ్డ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. రేగులగడ్డ గ్రామానికి చెందిన నారాయణ.. తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి భార్యపై కత్తితో దాడి చేసి.. విచక్షణరహితంగా పొడిచి హత్య చేశాడు.


అనంతరం ఆమె గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే నారాయణ ఇంట్లో నుంచి అర్థరాత్రి వేళ బిగ్గరగా శబ్ధాలు వస్తున్నాయి. దీంతో స్థానికులు వెంటనే నారాయణ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే భార్యాభర్తలు ఇద్దరు మంచంపై రక్తం మడుగులో పడి ఉన్నారు. ఆ వెంటనే పోలీసులతోపాటు 108కి సమాచారం అందించారు.


108 వాహనం హుటాహుటిన నారాయణ ఇంటికి చేరుకుంది. ఈ సందర్భంగా 108 సిబ్బంది.. వెంటనే నారాయణను పరీక్షించారు. అతడు కొన ఊపిరితో ఉండటంతో పొదిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే నారాయణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.


ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక నారాయణ భార్య అంజమ్మ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక ఈ కేసులో భాగంగా పోలీసులు నారాయణ, అంజమ్మ ఇంటి పరిసరాల్లోని వారిని విచారిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ కార్యకర్తకు మంత్రి లోకేశ్ అభయ హస్తం

యువతిపై లైంగిక దాడి.. మీ దేశానికి వెళ్లాలంటూ నిందితులు ఆదేశం

For More AP News And Telugu News

Updated Date - Sep 13 , 2025 | 09:08 PM