Share News

Sikh Woman In London: దారుణం.. సిక్కు యువతిపై లైంగిక దాడి.. ఆ తర్వాత..

ABN , Publish Date - Sep 13 , 2025 | 03:26 PM

బ్రిటన్‌లో సిక్కు యువతిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆమెను వారిద్దరూ బెదిరించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Sikh Woman In London: దారుణం.. సిక్కు యువతిపై లైంగిక దాడి.. ఆ తర్వాత..
Sikh Woman In London

లండన్, సెప్టెంబర్ 13: బ్రిటన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓల్డ్ బరీ పట్టణంలో సిక్కు మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం 'మీ దేశానికి వెళ్లిపో' అంటూ బాధితురాలిని బెదిరించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఈ ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు జల్లెడ పట్టారు. ఆ క్రమంలో నిందితులను పోలీసులు గుర్తించారు. వారు శ్వేత జాతీయులని స్పష్టం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు వివరించారు.


మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై బ్రిటన్‌లోని ప్రవాస భారతీయులంతా మండిపడుతున్నారు. దీనిని జాతి వివక్షతో కూడిన దాడిగా పోలీసులు అభివర్ణిస్తున్నారు. ఈ దాడి జరిగిన ప్రాంతంలో గస్తీని పెంచుతామని పోలీసులు స్పష్టం చేశారు. సిక్కు మహిళపై ఈ లైంగిక దాడి జరగడంతో.. ఆ మతస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు ఈ ఘటనపై బ్రిటన్‌ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ స్పందించారు. ఈ లైంగిక దాడిని ఖండించారు. ఇటీవల కాలంలో బహిరంగ జాత్యహంకారం పెరిగిందనడానికి ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తుందన్నారు. సిక్కులతోపాటు ప్రతి మతస్తులను గౌరవించాలని.. వారికి విలువ ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దేశ ప్రజలకు సూచించారు.


ఇదే అంశంపై ఇల్‌ఫోర్డ్ ఎంపీ జస్ అత్వాల్ సైతం స్పందించారు. ఈ తరహా ఘటనలు తీవ్రంగా పరిగణించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇటువంటి ఘటనలు.. దేశంలో జాత్యహంకారం ఎంత తీవ్రంగా ఉందనే విషయం బహిర్గతం చేస్తుందన్నారు. అదీకాక.. ఇటీవల వోల్వర్‌హాంప్టన్ రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు వృద్ధ సిక్కులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ వృద్ధులపై టీనేజర్లు.. వరుసగా పిడిగుద్దులు గుద్దారు. ఈ ఘటన సైతం బ్రిటన్‌లో తీవ్ర సంచలనం రేపింది. బ్రిటన్‌లోని ప్రవాసీయులపై మరీ ముఖ్యంగా సిక్కులపై జాత్యంహర దాడులు జరుగుతుండడం పట్ల భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ కార్యకర్తకు మంత్రి లోకేశ్ అభయ హస్తం

హరీష్ రావు, కేటీఆర్‌‌లకు బీజేపీలో చేరినట్లు నోటీసులు పంపిస్తాం..

Updated Date - Sep 13 , 2025 | 04:19 PM