Share News

Nara Lokesh Help to YCP Worker: వైసీపీ కార్యకర్తకు మంత్రి లోకేశ్ అభయ హస్తం

ABN , Publish Date - Sep 13 , 2025 | 03:45 PM

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ మరోసారి తన మానవత్వాన్ని చాటు కున్నారు. వైసీపీ కార్యకర్త విజ్ఞప్తి మేరకు అతడికి సాయం అందించేందుక సానుకూలంగా స్పందించారు.

Nara Lokesh Help to YCP Worker: వైసీపీ కార్యకర్తకు మంత్రి లోకేశ్ అభయ హస్తం
Nara Lokesh Help to YCP Worker

అమరావతి, సెప్టెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ మరో సారి తన ఉదారతను చాటుకున్నారు. వైసీపీ కార్యకర్తకు మంత్రి లోకేశ్ సాయం చేస్తానని అభయ హస్తం అందించారు. తాను ఆపదలో ఉన్నానని.. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా తనకు సహయం అందించాలంటూ మంత్రి నారా లోకేశ్‌ను వైసీపీ కార్యకర్త సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. జగన్ ఫ్యాన్స్ క్యాంపెయిన్ పేరుతో మంత్రి నారా లోకేశ్‌కు వైసీపీ కార్యకర్త ట్వీట్ చేశారు.


ఈ అభ్యర్థన పట్ల నారా లోకేశ్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కావాల్సిన సాయం తప్పక అందజస్తానంటూ వైసీపీ కార్యకర్తకు ఆయన భరోసా కల్పించారు. సదరు పార్టీ కార్యకర్తకు సాయం అందేలా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా లోకేశ్ శనివారం వెల్లడించారు. పార్టీలకు అతీతంగా వైసీపీ కార్యకర్తకు సాయం అందించేందుకు మంత్రి నారా లోకేశ్ ముందుకు రావడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

యువతిపై లైంగిక దాడి.. మీ దేశానికి వెళ్లాలంటూ నిందితులు ఆదేశం

అయ్యో పాపం.. హిజ్రాలు ఎంత పని చేశారంటే..

For More AP News And Telugu News

Updated Date - Sep 13 , 2025 | 03:46 PM