Hijra Attack Young Woman: అయ్యో పాపం.. హిజ్రాలు ఎంత పని చేశారంటే..
ABN , Publish Date - Sep 13 , 2025 | 03:34 PM
విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. గిరిపురానికి చెందిన కుమారి అనే యువతిపై ఈనెల 11న కొందరు హిజ్రాలు దాడి చేశారు.
విజయవాడ: దేశవ్యాప్తంగా కొంతమంది హిజ్రాల ఆగడాలు(Hijra's Attacks) అంతకంతకు పెరిగిపోతున్నాయి. అతి జుగుప్సాకరంగా ప్రవర్తిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శుభ, అశుభ కార్యం ఏదైనా సరే దందా మెుదలుపెడతారు. గృహప్రవేశాలు, పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు ఇలా కార్యక్రమం ఏదైనా సరే ఇళ్ల వద్దకు ఇట్టే వాలిపోతుంటారు. డిమాండ్ చేసి మరీ వేలకు వేలు దోచేస్తుంటారు. ఇక రైళ్లు, బస్టాండ్లు, సిగ్నల్స్ వంటి ప్రాంతాల వద్ద చెప్పాల్సిన పనే లేదు. వారు డిమాండ్ చేసినంత ఇవ్వాల్సిందే. డబ్బులు ఇవ్వమని చెబితే.. అత్యంత దారుణంగా తిట్ల పురాణం అందుకుంటారు. ఒంటిపై బట్టలు సైతం తీసేసి అతి దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. వాళ్లలో వాళ్లే గ్రూపులుగా ఏర్పడి ఏరియాల వారీగా దందాలకు పాల్పడుతుంటారు.
అయితే హిజ్రాల తీరుతో తాజాగా ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. విజయవాడ (Vijayawada) మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. గిరిపురానికి చెందిన కుమారి అనే యువతిపై ఈనెల 11న కొందరు హిజ్రాలు దాడి చేశారు. అత్యంత దారుణంగా అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా కొట్టారు. ఆ అవమానం తట్టుకోలేక అదే రోజు ఆమె పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందతున్న సదరు యువతి ఇవాళ(శనివారం) చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచింది. హిజ్రాల దాడికి ప్రేమ వ్యవహారం కారణంగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిజ్రాలు ఎవరూ, ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనే పూర్తి విషయాలను ఆరా తీస్తున్నారు.
అయితే.. హిజ్రాల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని విజయవాడ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాంగులుగా ఏర్పడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. ఏ శుభకార్యం చేసుకున్నా వచ్చి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారని.. ఇప్పుడు ప్రాణాలు సైతం తీసేందుకు వెనకాడడం లేదని మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!
Read Latest Telangana News and National News