Share News

Heartbreaking Incident: ఉరేసుకున్న తల్లి.. కాపాడేందుకు 13 ఏళ్ల బాలుడి యత్నం

ABN , Publish Date - Oct 09 , 2025 | 05:11 PM

ఈ భూమి మీద అమ్మపై ప్రేమలేని వారు ఉండరు. ఇక తల్లి కోసం ఏదైనా చేసేందుకు చాలా మంది బిడ్డలు ఉంటారు. అయితే తాజాగా తన తల్లి ప్రాణాలు కాపాడేందుకు ఓ బాలుడు చేసిన ప్రయత్నం అందరని కంటతడి పెట్టించింది. కళ్లెదుటే తల్లి ఉరేసుకుంటుంటే అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు ఆమెను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నించినా కాపాడుకోలేకపోయాడు.

Heartbreaking Incident: ఉరేసుకున్న తల్లి.. కాపాడేందుకు 13 ఏళ్ల బాలుడి యత్నం
Tragic Incident

ఈ భూమి మీద అమ్మపై ప్రేమలేని వారు ఉండరు. ఇక తల్లి కోసం ఏదైనా చేసేందుకు చాలా మంది బిడ్డలు ఉంటారు. అయితే తాజాగా తన తల్లి ప్రాణాలు కాపాడేందుకు ఓ బాలుడు చేసిన ప్రయత్నం అందరని కంటతడి పెట్టించింది. కళ్లెదుటే తల్లి ఉరేసుకుంటుంటే అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు ఆమెను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నించినా కాపాడుకోలేకపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చేటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన సుధ(42), నర్సింహ దంపతులు బతుకుదెరువుకు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. నాలుగేళ్లుగా వనస్థలిపురం సమీపంలోని మారుతీనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి 18, 13 వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. భవన నిర్మాణ మేస్త్రీగా పనిచేస్తున్న నర్సింహ మద్యానికి బానిసయ్యాడు. సుధ ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.


మరోవైపు చిన్న కుమారుడికి మధుమేహం సమస్య ఉంది. వైద్యం చేయించే స్థోమత లేక సుధ తీవ్ర మనోవేదనకు గురయ్యేది. అలానే ఇటీవల పెద్దకొడుకు పక్కింట్లో ఇనుప రాడ్డు చోరీ చేయగా ఆ యజమాని మందలించాడు. సుధ మనస్తాపానికి గురైంది. ఈ బాధలన్నింటినీ పక్కింటి మహిళతో పంచుకొని కన్నీరు పెట్టుకుంది. మంగళవారం రాత్రి భర్తలేని సమయంలో పెద్ద కుమారుడిని పెరుగు తీసుకురమని బజారుకు పంపింది. చిన్న కుమారుడు చూస్తుండగానే సీలింగ్‌ ఫ్యానుకు చీరతో ఉరేసుకుంది. ఆ బాలుడు అనారోగ్యంతో బాధపడుతూనే ఫ్యానుకు వేలాడుతున్న తల్లి కాళ్లు పట్టుకుని ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించాడు. తన చేతిలోనే తల్లి ప్రాణాలు వదలటంతో అమ్మా.. అమ్మా.. అంటూ రోదించాడు. తిరిగొచ్చిన పెద్ద కుమారుడు స్థానికుల సాయంతో తల్లిని కిందకి దింపి 108లో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించినా ఆమె చనిపోయిందంటూ వైద్యులు ధ్రువీకరించారు.


ఇవి కూడా చదవండి...

భగవంతునికి భక్తుడికి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తా: సుమంత్ రెడ్డి

చిత్తూరులో టీడీపీ నిరసన.. నారాయణ స్వామిని అరెస్ట్ చేయాలంటూ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 09 , 2025 | 05:11 PM