Share News

Chevireddy Bhaskar Reddy notices: వైసీపీ నేత చెవిరెడ్డికి నోటీసులు.. ఏ విషయంలో అంటే

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:55 PM

Chevireddy Bhaskar Reddy notices: వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు పలు కేసులపై జైలులో ఉండగా.. తాజాగా మరో కీలక నేతకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

 Chevireddy Bhaskar Reddy notices: వైసీపీ నేత చెవిరెడ్డికి నోటీసులు.. ఏ విషయంలో అంటే
Chevireddy Bhaskar Reddy notices

ప్రకాశం, మార్చి 12: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి (Former MLA Chevireddy Bhaskar Reddy) ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంగించారంటూ నమోదైన ఐదు కేసులకు సంబంధించి చెవిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చెవిరెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎర్రగొండపాలెంలో మూడు కేసులు, దోర్నాల, పెద్దారివీరుడులో ఒక్కొక్క కేసు నమోదు అయ్యింది. ఐదు కేసులపై ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోటీసులు ఇచ్చారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో చెవిరెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఐదు కేసులో ఎర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను బెదిరించిన కేసు కూడా ఉంది.


chevireddy-bhaskar-reddy.jpg

2024 ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఎన్నికల నియామాలను ఉల్లంఘించారంటూ అప్పట్లోనే చెవిరెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. అందులో ఎర్రగొండపాలెంలో నమోదైన మూడు కేసుల్లో ఆర్వో శ్రీలేఖను తనకు అనుకూలంగా పనిచేయడం లేదంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరించిన కేసు ఉంది. దీంతో పాటు దోర్నాల, పెద్దారివీరుడులో కూడా ఎన్నికల నియమావళిని వైసీపీ నేత ఉల్లంఘించి.. ఎన్నికల ప్రచారం నిర్వహించారని అప్పట్లోనే కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.

Borugadda Anil Kumar: బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు.. రాజమండ్రి జైలుకి గుంటూరు పోలీసులు


కాగా.. ఇప్పటికే వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళిపై పలు కేసులు నమోదు అవగా.. వారిని అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్‌ బెదిరింపు, కిడ్నాప్‌ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసానిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరి పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించి చెవిరెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.


ఇవి కూడా చదవండి...

Telangana Assembly budget session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ ప్రసంగం ఇదే

AP Legislative Council: సభ మొదలవగానే షూరూ చేసిన వైసీపీ..

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 12 , 2025 | 01:08 PM