Share News

AP Legislative Council: సభ మొదలవగానే షూరూ చేసిన వైసీపీ..

ABN , Publish Date - Mar 12 , 2025 | 10:37 AM

AP Legislative Council: ఏపీ శాసనసమండలి సమావేశాలు కొద్దిసేపు వాయిదా పడ్డాయి. సభలో వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు సభలో ఆందోళనకు దిగారు.

AP Legislative Council: సభ మొదలవగానే షూరూ చేసిన వైసీపీ..
AP Legislative Council

అమరావతి, మార్చి 12: ఏపీ శాసనమండలి సమావేశాలు (AP Legislative Council) బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే సభ మొదలైన వెంటనే వైసీపీ సభ్యుల (YSRCP) ఆందోళనలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మండలిలో విద్యారంగ సమస్యలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషేన్‌రాజు (AP Legislative Council Chairman Moshen Raju) తిర్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన , ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులపై నినాదాలు చేశారు. అంతే కాకుండా చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసనకు దిగారు వైసీపీ ఎమ్మెల్సీలు. దీంతో సభలో రచ్చ చోటు చేసుకుంది.


వైసీపీ ఆందోళనపై మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. షార్ట్ డిస్కషన్‌లో అన్నీ చర్చిద్దామన్నారు. రూ.4,500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారో వైసీపీ సభ్యులు చెప్పాలని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు పెంచుతారు.. వాళ్లే ధర్నా చేస్తారంటూ మండిపడ్డారు. అయితే మంత్రి చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో వైసీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

lokesh-minister.jpg


ఇవి కూడా చదవండి...

YS Jagan: ప్రతిపక్షంలో కూర్చోవటం కొత్తకాదు..: జగన్

Borugadda Anil: ఏపీ హై కోర్టు సీరియస్..లొంగిపోయిన బోరుగడ్డ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 12 , 2025 | 10:42 AM