YS Jagan: ప్రతిపక్షంలో కూర్చోవటం కొత్తకాదు..: జగన్
ABN , Publish Date - Mar 12 , 2025 | 10:31 AM
గతంలో ప్రతిపక్షంలో ఉన్నామని, కన్నుమూసి కన్ను తీరిచేలోపు ఏడాది గడిచిందని, మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే వచ్చేది వైసీపీనేనని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత వైసీపీ పాలనలో అన్నీ వర్గాలను అక్కున చేర్చుకున్నామని,వైసీపీ ఏదైనా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకమని ఆయన అన్నారు.
అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆవిర్భవించి (Foundation) 15 ఏళ్లు (15 Years) అవుతుందని.. ప్రజల కష్టాల నుంచి పుట్టిన పార్టీ అని.. ప్రతిపక్షంలో కూర్చోవటం కొత్తకాదని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jagan) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రతిపక్షంలో (Opposition) ఉన్నామని, కన్నుమూసి కన్ను తీరిచేలోపు ఏడాది గడిచిందని, మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే వచ్చేది వైసీపీనేనని అన్నారు. గత వైసీపీ పాలనలో అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్నామని, వైసీపీ ఏదైనా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకమని ఆయన అన్నారు. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి ఇవాళ యాధృచ్చికంగా నిరసన కార్యక్రమం జరుగుతుందన్నారు.
Also Read..:
అసెంబ్లీ పరిసరాల్లో గట్టి భద్రతా చర్యలు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం అయ్యాయని జగన్ ఆరోపించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు ఏడాదికి రూ. 2800 కోట్లు కావాలని, వసతి దీవెనకు రూ. 1100 కోట్లు కావాలని అన్నారు. కూటమి ప్రభుత్వం గత ఏడాది రూ. 700 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. పిల్లలకు కావలసిన కేటాయింపులు చేయాల్సింది పోయి వారిని ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. వైసీపీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని, ప్రజల గొంతుకగా పోరాడుతుందని స్పష్ఠం చేశారు. ఇవాళ పోరుబాటలో పాల్గొంటున్న యువత, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్లుగా వైసీపీతో కలసి నడుస్తున్నా ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి అన్నారు.
వైసీపీ యువత పోరు
కాగా గత వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఇప్పుడు యువత పోరు పేరిట నాటకాలు ఆడుతోందని టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి, విజయనగరం రీజియన్ ఆర్టీసీ చైర్మన్ దొన్నుదొర ధ్వజమెత్తారు. మంగళవారం సాయంత్రం తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యా వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్లో ఈ ఏడాది ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ.788 కోట్లు చెల్లించిందన్నారు. ఇంకా వైసీపీ హయాంలో పేరుకుపోయిన బకాయిలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడతల వారీగా చెల్లిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి ఖజానాను ఖాళీ చేసిందని, ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి యువత పోరు పేరిట కొత్త నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని, రహదారులకు గోతులు కూడా పూడ్చలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారులకు మరమ్మతులు చేసినట్టు చెప్పారు. వైసీపీ పాలన వల్ల రాష్ట్రం వెనుకబడిపోయిందని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు
అన్ని కేసుల్లో పోసానికి బెయిల్.. విడుదలకు బ్రేక్..
For More AP News and Telugu News