MP Kesineni Nani : అమరావతిలో భారీ క్రికెట్ స్టేడియం
ABN , Publish Date - Jan 26 , 2025 | 04:19 AM
‘‘దేశంలో ఇప్పటివరకూ అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఒక 1.10 లక్షల సిటింగ్ సామర్థ్యంతో అహ్మదాబాద్‌లో ఉంది.
60 ఎకరాల్లో 800 కోట్లతో నిర్మాణం
1.25 లక్షల సిటింగ్ సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద స్టేడియం
రాజధాని స్పోర్ట్స్ సిటీలో నిర్మించాలని ప్రణాళిక: కేశినేని చిన్ని
ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ వెల్లడి
అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్ని అమరావతిలో నిర్మించాలని నిర్ణయించామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఈ భారీ స్టేడియం నిర్మాణం కోసం అరవై ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని ఆయన వెల్లడించారు. ‘‘దేశంలో ఇప్పటివరకూ అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఒక 1.10 లక్షల సిటింగ్ సామర్థ్యంతో అహ్మదాబాద్‌లో ఉంది. దానికి మించి 1.25 లక్షల వీక్షకులు కూర్చునేలా కొత్త స్టేడియం నిర్మించాలని అనుకొంటున్నాం. బీసీసీఐ నుంచి దీనికి ఆర్థిక సాయం తీసుకోవాలని నిర్ణయించాం. కొంత స్థానికంగా మేము సమీకరిస్తాం. అమరావతిలో రెండు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అందులోనే ఈ స్టేడియం వస్తుంది’ అని ఆయన చెప్పారు. ఇక అమరావతిలో 2029 జాతీయ క్రీడలు నిర్వహించడానికి బిడ్ వేయనున్నట్లు శివనాథ్ తెలిపారు. క్రికెట్ కోసం ప్రత్యేకంగా మూడు అకాడమీలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర, విజయవాడ, రాయలసీమలో ఈ అకాడమీలు ఏర్పాటు అవుతాయని ఆయన చెప్పారు. వీటి నిర్వహణకు మిథాలీ రాజ్, రాబిన్ సింగ్‌లను తీసుకొంటున్నామని, వారి ఆధ్వర్యంలో క్రికెట్ శిక్షణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో ఐపీఎల్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం పదిహేను మంది ఎంపిక కావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం అన్ని వసతులతో విశాఖ స్టేడియాన్ని ఆధునీకరిస్తున్నామని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు
విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే
వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే
కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..
For More Andhra Pradesh News and Telugu News..