Pawan Kalyan wishes ABN: ఆంధ్రజ్యోతికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
ABN , Publish Date - Oct 15 , 2025 | 09:46 PM
ఆంధ్రజ్యోతి’ దిన పత్రిక 23వ వార్షికోత్సవం, ఏబీఎన్ ఛానల్ 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రజ్యోతికి హృదయపూర్వక అభినందనలు..
అమరావతి, అక్టోబర్ 15: ఆంధ్రజ్యోతి’ దిన పత్రిక 23వ వార్షికోత్సవం, ఏబీఎన్ ఛానల్ 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు, ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రజ్యోతికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో ఒక సందేశమిచ్చారు.
' ‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రిక 23వ వార్షికోత్సవం సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వేమూరి రాధాకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ ఛానెల్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ సంపాదకులు, పాత్రికేయులకు, సాంకేతిక నిపుణులకు, సిబ్బందికి అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ పత్రిక, ఛానెల్ పయనం అప్రతిహతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.' అని పవన్ తన సందేశంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లండి.. బిహార్ బీజేపీ కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం
బీజేపీ రెండో జాబితా.. అలీనగర్ నుంచి సింగర్ మైథిలీ ఠాకూర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి