Rajini, Chandhra Babu: సీఎం ట్వీట్‌కు సూపర్ స్టార్ రియాక్షన్..
ABN , Publish Date - Aug 16 , 2025 | 07:40 PM
రజనీకాంత్ సినిమాలు లెక్కలేనన్ని జీవితాలను తాకాయని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. నడక, సంభాషణలు పలకడం, హావభావ విన్యాసాల్లో రజనీ ప్రత్యేకతను చూపిస్తారని తెలిపారు.
అమరావతి: చిత్ర పరిశ్రమలో 50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అద్భుతమైన కెరీర్‌లో రజనీ తన ఐకానిక్ నటనతో లక్షలాది మందిని అలరించడమే కాకుండా, సామాజిక అవగాహన పెంచడానికి తన చిత్రాలను ఒక మాధ్యమంగా ఉపయోగించుకున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.
రజనీ మాటలు సామాజిక సమస్యలపై ప్రతిబింబించడానికి ప్రేరణనిచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన సందేశాలు లెక్కలేనన్ని జీవితాలను తాకాయని చెప్పుకొచ్చారు. రజనీ నడకలో, సంభాషణలు పలకడంలో, హావభావ విన్యాసంలో ప్రత్యేకతను చూపిస్తారని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రజనీకాంత్‌కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
సీఎం చంద్రబాబు ట్వీట్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. చంద్రబాబు మాటలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తనను నిజంగా కదిలించాయని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. మీ దయగల సందేశం చాలా అర్థమైందని తెలిపారు. మీలాంటి వ్యక్తుల ప్రేమ, స్నేహంతో.. సినిమా ద్వారా తన ఉత్తమమైన సందేశాలను అందిస్తానని రజనీ పేర్కొన్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు రజనీ.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
రిజిస్టర్డ్ పోస్ట్ మాయం.. పోస్టల్ శాఖ కీలక నిర్ణయం