ABN Effect: ఏబీఎన్ ఎఫెక్ట్.. నవోదయ ప్రిన్సిపాల్ సస్పెండ్..
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:48 PM
ఏబీఎన్ కథనంపై స్పందించిన అధికారులు ప్రిన్సిపాల్ పెత్తనస్వామిని సస్పెండ్ చేశారు. పెత్తనస్వామిని సస్పెండ్ చేస్తూ.. డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బెరా ఉత్తర్వులు జారీ చేశారు.
నెల్లూరు: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై నవోదయ విద్యాలయ సమితి ఉన్నతాధికారులు స్పందించారు. మర్రిపాడు మండలం కృష్ణాపురం నవోదయ విద్యాలయం ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ పెత్తనస్వామి దాష్టీకంపై ఏబీఎన్‌లో కథనం ప్రసారం అయ్యింది. 6వ తరగతి విద్యార్థి మహేశ్ బాబుని వాష్‌రూమ్‌లో పడేసి పెత్తనస్వామి చితకబాదారు. విద్యార్థి తలని గోడకేసి మోదడంతో.. తలకి తీవ్రగాయం అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ దాష్టీకంపై ఏబీఎన్‌లో కథనం ప్రసారం అయ్యింది.
ఏబీఎన్ కథనంపై స్పందించిన అధికారులు ప్రిన్సిపాల్ పెత్తనస్వామిని సస్పెండ్ చేశారు. పెత్తనస్వామిని సస్పెండ్ చేస్తూ.. డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బెరా ఉత్తర్వులు జారీ చేశారు. హెడ్ క్వార్టర్స్ దాటి పోవద్దని హెచ్చరించారు. ఏబీఎన్ కథనంతో విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు.. పెత్తనస్వామి దగ్గరకు చేరుకున్నారు. విద్యార్థిని ఎందుకు కొట్టారని నిలదీశారు. విద్యార్థి నేతలు భారీగా చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఏబీఎన్ చోరవతో పెత్తనస్వామి సస్పెండ్ కావడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
243 సీట్లలో పోటీ చేస్తాం..బీహార్‌లో గేమ్ ఛేంజర్ ప్లాన్..