Minister Anagani Satya Prasad: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై.. మంత్రుల పర్యటన..
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:20 PM
గత వైసీపీ ప్రభుత్వం 26 జిల్లాల విభజన ప్రక్రియను అస్తవ్యస్తం చేసిందని మంత్రి అనగాని ఆరోపించారు. గత ప్రభుత్వం తొందరపాటు తనంలో విభజన చేపట్టిందని విమర్శించారు.
అమరావతి: ఏపీ సచివాలయంలో కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం ముగిసింది. సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారంపై చర్చ జరిగినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. చర్చలో భాగంగానే జిల్లాల, మండలాల, గ్రామల సరిహద్దుల మార్పులపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
గత వైసీపీ హయాంలో అస్తవ్యస్తం..
గత వైసీపీ ప్రభుత్వం 26 జిల్లాల విభజన ప్రక్రియను అస్తవ్యస్తం చేసిందని మంత్రి అనగాని ఆరోపించారు. గత ప్రభుత్వం తొందరపాటు తనంలో విభజన చేపట్టిందని విమర్శించారు. గత నాయకుల ఒత్తిళ్లతో అధికారులు ప్రజాభిప్రాయం మేరకు పనిచేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికే GMOను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు.
జిల్లాల్లో మంత్రుల పర్యటన..
ఈ నెల 29, 30న మంత్రులు 2 బృందాలుగా విడిపోయి జిల్లాల్లో పర్యటిస్తారని మంత్రి అనగాని స్పష్టం చేశారు. 13 ఉమ్మడి జిల్లాల హెడ్ క్వార్టర్లలో ప్రజలతో, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారని వివరించారు. సెప్టెంబర్ 2 నాటికి గ్రీవెన్స్ పూర్తిచేస్తామని చెప్పారు. జిల్లాల పర్యటనల అనంతరం అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి.. సీఎం చంద్రబాబుకు నివేదిక అందిస్తామని మంత్రి అనగాని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
అభిమానిని తోసేసిన జయా బచ్చన్.. దెబ్బకు జడుసుకున్నాడు..
30 ఏళ్ల స్నేహం.. ఫ్రెండ్ భార్యతో ఎఫైర్ పెట్టుకుని