Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో ట్విస్ట్.. ఒక్కరు కాదు ఇద్దరు..
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:25 AM
బైక్‌పై వెళ్తూ మృతి చెందిన శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు గుర్తించారు. ఇద్దరూ కలిసి డోన్‌కు వెళ్తుండగా.. ఇరువురిని బస్సు ఢీకొన్నట్లు తెలిపారు.
కర్నూలు: చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బైక్‌పై వెళ్తూ మృతి చెందిన శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు గుర్తించారు. ఇద్దరూ కలిసి డోన్‌కు వెళ్తుండగా.. ఇరువురిని బస్సు ఢీకొన్నట్లు తెలిపారు. బస్సు ఢీకొనడంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఎర్రిస్వామి ఎగిరిపడ్డాడు. అనంతరం గాయాలతో సంఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి.కావేరి ట్రావెల్స్ బస్సు నిన్న(శుక్రవారం) తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఓ బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి అంతకంతకూ పెరిగి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బస్సులోనే 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరికొందరు మంటలను చూసిన వెంటనే అద్దాలను పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. బైకు బస్సు కిందకు వెళ్లి డీజిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బస్సును ఢీకొనే సమయంలో బైక్‌పై ఉన్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
నాగుల చవితి.. తెల్లవారే పుట్టలో పాలు పోసిన మండలి బుద్ధ ప్రసాద్