Shivashankar Biker Video: ప్రమాదానికి ముందు బైకర్ చివరి వీడియో ఇదే!
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:25 AM
ఈ ప్రమాదంలో బైకర్ శివశంకర్ కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ప్రస్తుతం బైకర్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్‌లో శివశంకర్ ఉన్న వీడియో బయటకు వచ్చింది.
కర్నూలు, అక్టోబర్ 25: కర్నూలు జిల్లాలో జరిగి బస్సు ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. అయితే బస్సు ప్రమాదానికి కారణం ఓ బైక్. జిల్లాకు చెందిన శివశంకర్ అనే వ్యక్తి ఇళ్లలో గ్రానెట్ ఫ్లోరింగ్ పనులు చేస్తుంటాడు. ఆ పని నిమిత్తమే శివశంకర్ అర్ధరాత్రి నంద్యాలకు బైక్‌పై బయలుదేరాడు. కానీ అంతలోనే చిన్నటేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు.. శివశంకర్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైకర్ దూరంగా రోడ్డపక్కన పడిపోగా... అతడి బైక్ మాత్రం బస్సు కిందకు వెళ్లి ఇరుక్కుపోయింది.
ఈ ప్రమాదంలో బైకర్ శివశంకర్ కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ప్రస్తుతం శివశంకర్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్‌లో శివశంకర్ ఉన్న వీడియో బయటకు వచ్చింది. తన స్నేహితుడితో కలిసి బైక్‌పై పెట్రోల్ బంక్‌కు వచ్చాడు బైకర్. పెట్రోల్ పోయించుకున్న అనంతరం శివశంకర్ బైక్‌పై వెళ్లినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. కాగా.. బైక్‌పై వెళ్లే సమయంలో అతడు కాస్త తాగి తూగినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ఈక్రమంలో శివశంకర్ తాగి ఉన్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శివశంకర్‌కు సంబంధించిన ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.
ప్రమాదానికి ముందు బైకర్ వీడియో...
ఇవి కూడా చదవండి..
కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
నాగుల చవితి.. తెల్లవారే పుట్టలో పాలు పోసిన మండలి బుద్ధ ప్రసాద్
Read Latest AP News And Telugu News