Bus Accident: వామ్మో మరో ప్రమాదం.. విద్యార్థుల స్కూల్ బస్సుకు
ABN , Publish Date - Oct 25 , 2025 | 09:39 AM
ప్రకాశం జిల్లాలో ఓ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కొండపిలో బస్సులో స్కూల్‌కు బయలుదేరిన విద్యార్థులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈరోజు ఉదయం శాంతినికేతన్ స్కూల్‌కు చెందిన బస్సు.. విద్యార్థులను ఎక్కించుకుని స్కూల్‌కు బయలుదేరింది.
ప్రకాశం, అక్టోబర్ 25: రాష్ట్రాన్ని బస్సు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. వరుస బస్సు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న జరిగిన కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది సజీవదహనం అయిన విషయం తెలిసిందే. ఈరోజు కూడా రాష్ట్రంలో మరో రెండు బస్సు ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అందులో ఒక ప్రైవేటు బస్సుకు కాగా.. మరొకటి స్కూల్ బస్సుకు. అయితే రెండు ప్రమాదాల్లో ప్రయాణికులు, విద్యార్థులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. లారీని అధిగమించబోయి ఐరన్ భారీ గేట్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసం అవగా.. బస్సులో డ్రైవర్లు, 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఇక ప్రకాశం జిల్లాలో ఓ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కొండపిలో బస్సులో స్కూల్‌కు బయలుదేరిన విద్యార్థులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈరోజు ఉదయం శాంతినికేతన్ స్కూల్‌కు చెందిన బస్సు.. విద్యార్థులను ఎక్కించుకుని స్కూల్‌కు బయలుదేరింది. అయితే బస్సు కొండపి సమీపంలోకి రాగానే అదుపుతప్పి అట్లేరు వాగు వద్ద చప్టాపై నుంచి పక్కకు ఒరిగింది. అయితే వాగులో నీటి ప్రవాహం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. బస్సు ఒరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని బస్సులో ఉన్న 40 మంది విద్యార్థులను క్షేమంగా కిందకి దించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
నాగుల చవితి.. తెల్లవారే పుట్టలో పాలు పోసిన మండలి బుద్ధ ప్రసాద్
Read Latest AP News And Telugu News