PM Modi Kurnool Visit: కర్నూల్‌కు ప్రధాని మోదీ రాక.. ఏర్పాట్లలో టీడీపీ నేతలు
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:06 PM
ప్రధాని మోదీ రాక కోసం కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాని సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
కర్నూల్: టూరిజం కారిడార్‌పై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. అనంతపూర్, కర్నూలు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. శ్రీశైలంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కానుందని చెప్పారు. ప్రధాని మోదీ వస్తున్నందున చాలా అంచనాలున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాటి రాజధాని కర్నూలుపై ప్రధాని మోదీకి అవగాహన ఉంటుందని చెప్పారు. కర్నూలుకి మోదీ వరం ఇస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. GST తగ్గింపుతో ప్రజలకు చాలా మేలు జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పర్యటనను ప్రజలు విజయవంతం చేయాలని మంత్రి టీజీ భరత్ కోరారు.
కనీవినీ ఎరుగని రీతిలో ప్రధాని సభ: పల్లా శ్రీనివాసరావు
ప్రధాని మోదీ రాక కోసం కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాని సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కడపలో మహానాడు.. అనంతపురంలో సూపర్ సిక్స్ సభలు సక్సెస్ అయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. కర్నూలును డ్రోన్ హబ్‌గా కూటమి ప్రభుత్వం మార్చనుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమాంతర అభివృద్ధి జరగాలన్నదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని వివరించారు. కూటమి సర్కారు అన్ని జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Central Govt: పాఠశాలల్లో యూపీఐతో ఫీజుల వసూలు
Dalit IPS Officer: ఐపీఎస్ అధికారి ఆత్మహత్యలో కొత్తగా అట్రాసిటీ సెక్షన్