Share News

YSRCP leaders protest: పోలీసులను తోసుకుంటూ మరీ కలెక్టరేట్‌లోకి వైసీపీ నేతలు

ABN , Publish Date - Mar 12 , 2025 | 03:27 PM

YSRCP leaders protest: విజయవాడలో కలెక్టరేట్ ముట్టడి పేరుతో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఏకంగా పోలీసులకు తోసుకుని మరీ కలెక్టరేట్‌లోకి ప్రవేశించారు వైసీపీ శ్రేణులు.

YSRCP leaders protest: పోలీసులను తోసుకుంటూ మరీ కలెక్టరేట్‌లోకి వైసీపీ నేతలు
YSRCP leaders protest

విజయవాడ, మార్చి 12: యువత పోరు పేరుతో కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు వైసీపీ నేతలు (YSRCP Leaders) ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ నేతలు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, మేయర్ భాగ్యలక్ష్మి, పోతున మహేష్, గౌతమ్ రెడ్డి వైసీపీ నేతలు కలెక్టరేట్ ముట్టడికి వచ్చారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే బారికేడ్స్‌ తోసుకుని మరీ వైసీపీ నేతలు కలెక్టరేట్‌లోకి వచ్చారు. డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కలెక్టరేట్ మూడు గేట్లను కూడా ఫ్యాన్ పార్టీ నేతలు ముట్టడించారు. చివరకు పోలీసులను తోసుకొని కలెక్టరేట్లోకి ప్రవేశించిన నేతలు.. కలెక్టర్ లేకపోవడంతో డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు.


అనంతరం వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పేద విద్యార్థుల ఆవేదనను కూటమి నాయకుల దృష్టికి తీసుకువచ్చే విధంగా చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఒక ఉద్యమం లాగా విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలకు ముట్టడిస్తున్నామన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని.. కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యార్థులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఉచిత ఫ్రీ మెడికల్ కాలేజీలను జగన్ మోహన్ రెడ్డి అందించడానికి శ్రీకారం చుడితే, మెడికల్ సీట్లను అమ్ముకునే కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

Posani Krishnamurali: పోసానికి బెయిల్.. జైలు నుంచి విడుదలపై సస్పెన్స్


తమ పిల్లలకు ఫీజులు కట్టడం లేదని, హాల్ టికెట్స్ ఇవ్వటం లేదని, ఎగ్జామ్స్ రాయనివ్వడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండు అని తమ బాధలు తీరేవని విద్యార్థులు బాధపడుతున్నారన్నారు. వైసీపీ నేతలు అందరం కలిపి ప్రతి జిల్లాలో కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు అందిస్తున్నామని వైసీపీ నేతలు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

AP Legislative Council: సభ మొదలవగానే షూరూ చేసిన వైసీపీ..

Chevireddy Bhaskar Reddy notices: వైసీపీ నేత చెవిరెడ్డికి నోటీసులు.. ఏ విషయంలో అంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 12 , 2025 | 03:27 PM