Share News

TDP Vs YSRCP: వైసీపీకి మండలిలో మంత్రి లోకేష్ ధీటైన సమాధానం

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:10 AM

అమ్మఒడి రాలేదు తల్లికి వందనం వస్తోందంటూ వైసీపీ ఎమ్మెల్సీలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పేరిట కొందరికే పథకాన్ని పరిమితం చేశారని విమర్శించారు

TDP Vs YSRCP: వైసీపీకి మండలిలో మంత్రి లోకేష్ ధీటైన సమాధానం
TDP Vs YSRCP

అమరావతి, సెప్టెంబర్ 23: తల్లికి వందనం పథకంపై వైసీపీ ఎమ్మెల్సీలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh). మంగళవారం శాసనమండలి సమావేశాలు మొదలయ్యాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా తల్లికి వందనం లబ్ధిదారులు ఎంతమంది అంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. అమ్మఒడి రాలేదు తల్లికి వందనం వస్తోందంటూ వైసీపీ ఎమ్మెల్సీలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పేరిట కొందరికే పథకాన్ని పరిమితం చేశారని విమర్శించారు. తల్లికి వందనం కింద కూటమి ప్రభుత్వం ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15వేలు ఇస్తోందని వివరించారు.


పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లకు తల్లికి వందనం వర్తించట్లేదని మండలి చైర్మన్ అడిగారు. అందరికీ వర్తించేలా జీవో లేదా మెమో ఉందా అని మంత్రిని ప్రశ్నించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం వర్తించేలా జీవో ఉందంటూ జీవోలోని అంశాన్ని ఛైర్మన్‌కు చదివి వినించారు మంత్రి. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు తమకూ వర్తింపచేయాలనే వినతి ప్రభుత్వ పరిశీలనలో ఉందని.. చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

రెండో రోజు దుర్గమ్మ ఏ అలంకారంలో దర్శనమిస్తున్నారంటే

దానిపై వాయిదా తీర్మానం విడ్డూరం.. వైసీపీపై లోకేష్ మండిపాటు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 12:55 PM