Guntur Cholera Outbreak: గుంటూరులో కలరా కలకలం.. ఎన్ని కేసులంటే
ABN , Publish Date - Sep 23 , 2025 | 09:51 AM
గుంటూరు జిల్లా వ్యాప్తంగా 114 మంది అనారోగ్యంతో అసుపత్రిలో చేరారు. వీరికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. నాలుగు కలరా కేసులు నమోదు అవగా.. ఈకోలీ బ్యాక్టరీయా కేసులు 16క నమోదు అయ్యాయి.
గుంటూరు, సెప్టెంబర్ 23: జిల్లాలో కలరా కలకలం రేపుతోంది. రోజు రోజుకు ఈకోలి బ్యాక్టీరియా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జీజీహెచ్‌కు డయోరియా లక్షణాలతో రోగులు తాకిడి ఎక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 114 మంది అనారోగ్యంతో అసుపత్రిలో చేరారు.వీరి నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. నాలుగు కలరా కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో మూడు, తెనాలిలో ఒకటి కలరా కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు. అలాగే ఈకోలీ బ్యాక్టరీయా కేసులు 16 నమోదు అయ్యాయి. మరొకరు షీగెల్లా బ్యాక్టీరియాతో బాధపడుతున్నారు. దీంతో వారికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు.
అయితే రోజు రోజుకు డయోరియా బాధితులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రైవేట్ అసుపత్రిలో, ఆర్ఎంపీలు వద్ద భారీగా రోగులు వైద్యం కోసం చేరుతున్న పరిస్థితి. కలరా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ప్రజలకు సూచనలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
రెండో రోజు దుర్గమ్మ ఏ అలంకారంలో దర్శనమిస్తున్నారంటే
Read Latest AP News And Telugu News