Share News

SIPB meeting 2025: రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Oct 08 , 2025 | 04:09 PM

ఐటీ, ఇంధనం, టూరిజం, ఎరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కిపైగా ప్రాజెక్టులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. వీటి ద్వారా 67 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి 11వ ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.

SIPB meeting 2025: రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్ సిగ్నల్
SIPB meeting 2025

అమరావతి, అక్టోబర్ 8: 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడింది. ఈరోజు (బుధవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. మూడు 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరిగింది. భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారుల నియామకానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు త్వరగా గ్రౌండ్ అయ్యేలా ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోనున్నారు.


ఐటీ, ఇంధనం, టూరిజం, ఎరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కిపైగా ప్రాజెక్టులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. వీటి ద్వారా 67 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి 11వ ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. రూ.87,520 కోట్లు పెట్టుబడి పెట్టనున్న రైడెన్ ఇన్ఫో టెక్ డేటా సెంటర్‌కు (RAIDEN INFO TECH DATA CENTER)కు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఎఫ్‌డీఐ రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైడెన్ ఇన్ఫో టెక్ డేటా సెంటర్‌ ఏర్పాటు కొత్త చరిత్రను లిఖిస్తుందని ఎస్ఐపీబీ సమావేశం పేర్కొంది.


ఇక.. అతిపెద్ద ఫారిన్ ఇన్వెస్టిమెంట్ సాధించడంపై ఐటీ మంత్రి నారా లోకేష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు అభినందనలు తెలియజేశారు. 15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన 11 ఎస్‌ఐపీబీల ద్వారా రూ. 7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. దీని ద్వారా 6.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం.. అగ్నిప్రమాదంపై సీఎం

హద్దు మీరితే తోక కట్ చేస్తాం.. వైసీపీకి గంటా వార్నింగ్

Read Latess AP News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 04:51 PM