Share News

Lokesh Congrats Shubhanshu: ఇది చారిత్రాత్మక ప్రయాణం.. శుభాంశు శుక్లాకు లోకేష్ అభినందనలు

ABN , Publish Date - Jun 25 , 2025 | 04:54 PM

Lokesh Congrats Shubhanshu: గ్రూప్ కెప్టెన్ శుభాంశ్ శుక్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మొదటి ఇస్రో అంతరిక్ష యాత్రికుడిగా రికార్డు సృష్టించారని మంత్రి లోకేష్ అన్నారు. యాక్సియం - 4 అంతర్జాతీయ అంతరిక్ష స్పెస్ స్టేషన్‌లో దిగడం గర్వకారణమని పేర్కొన్నారు.

Lokesh Congrats Shubhanshu: ఇది చారిత్రాత్మక ప్రయాణం.. శుభాంశు శుక్లాకు లోకేష్ అభినందనలు
Lokesh Congrats Shubhanshu

అమరావతి, జూన్ 25: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. దాంతో దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రలో నిలిచారు. శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. దీనిపై మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా శుభాంష్ శుక్లా, అతని బృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ ప్రయాణం ఎదురులేని భారత ఆత్మకు నిదర్శనంగా నిలుస్తుందంటూ మంత్రి ట్వీట్ చేశారు.


లోకేష్ ట్వీట్..

గ్రూప్ కెప్టెన్ శుభాంశ్ శుక్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మొదటి ఇస్రో అంతరిక్ష యాత్రికుడిగా రికార్డు సృష్టించారు. యాక్సియం-4 అంతర్జాతీయ అంతరిక్ష స్పెస్ స్టేషన్‌లో దిగడం గర్వకారణం. ఇది చారిత్రాత్మక ప్రయాణంగా నిలిచిపోతుంది. శుభాంశ్ శుక్లా ప్రయత్నం భారత అంతరిక్ష రంగంపైనే కాదు... ప్రపంచ అంతరిక్ష యాత్రలలో తనదైన ముద్ర వేస్తుంది. శుభాంశ్ శుక్లాకు అతని టీమ్‌కు అభినందనలు. ఈ అంతరిక్ష ప్రయాణం, ధైర్యం, ముందుచూపు, ఎదురులేని నూతన భారత ఆత్మకు నిదర్శనంగా నిలుస్తుంది’ అంటూ ట్వీట్ చేస్తూ.. ఇస్రోకు, నాసాకు, స్పేస్ ఎక్స్‌కు యాక్సియం-4, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, స్పేస్ ఒడిస్సికి ట్యాగ్ చేశారు మంత్రి లోకేష్. అలాగే శుభాంశ్ శుక్లా ప్రయాణించిన అంతరిక్ష వాహనంతో కూడిన ఫోటోను కూడా మంత్రి లోకేష్ ఎక్స్‌లో షేర్ చేశారు.


ఇవి కూడా చదవండి

కేంద్ర కేబినెట్‌లో చంద్రబాబు, లోకేష్‌ను మెచ్చుకున్న ప్రధాని

ప్రతీ కార్యకర్తను గౌరవిస్తాం: మంత్రి కొల్లు

Read latest AP News And Telugu News

Updated Date - Jun 25 , 2025 | 05:06 PM