Share News

Gareth Wynn Owen: సీఎం చంద్రబాబుపై బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ప్రశంసలు

ABN , Publish Date - Jun 25 , 2025 | 02:51 PM

రాజధాని అమరావతి నిర్మాణంలో సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న క్రియాశీలక పాత్రపై బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు విజన్‌పై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

Gareth Wynn Owen: సీఎం చంద్రబాబుపై బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ప్రశంసలు
gareth wynn owen

అమరావతి, జూన్ 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్న నాయకుడని బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్‌ సారథ్యంలోని ప్రతినిధి బృందం ప్రశంసించింది. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని మంత్రి నారాయణకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఓవెన్ తెలిపారు. ఇటీవల అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన బాగా జరిగిందని డిప్యూటీ హై కమిషనర్ గుర్తు చేశారు.


బుధవారం రాజధాని అమరావతిలో మంత్రి నారాయణతో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్‌తో కూడిన ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని ఆ బృందానికి మంత్రి పి. నారాయణ సోదాహరణగా వివరించారు. రాజధాని అమరావతి ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని ఈ సందర్భంగా వారికి పి. నారాయణ తెలిపారు.


అమరావతిలోని స్థానిక ఐకానిక్ భవనాల డిజైన్లు యూకేకు చెందిన నార్మన్ ఫాస్టర్ రూపొందించారని ఆ బృందానికి వివరించారు. ప్రదానంగా రాజధాని నిర్మాణాల్లో డిజైన్, ఇంజనీరింగ్ సేవల్లో ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఆసక్తి ఉందని ఉందని యూకే ఇన్‌ఫ్రాస్టెక్చర్ ఎక్స్‌పోర్ట్ గ్రూప్ చైర్ పర్సన్ పర్వీస్ వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్‌తోపాటు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో బ్రిటన్ ప్రభుత్వ వ్యవహారాలను డిప్యూటీ హై కమిషనర్ పర్యవేక్షిస్తున్న విషయం విదితమే.

ఈ వార్తలు కూడా చదవండి..

కార్యకర్తలతో మాట్లాడుతాం.. ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం: మంత్రి లోకేష్

అమ్మ వారు పూజలందుకునే మాసం.. ఆషాఢం

Read latest AP News And Telugu News

Updated Date - Jun 25 , 2025 | 02:51 PM