Share News

PV Sindhu: చాలా సంతోషంగా ఉంది: పీవీ సింధు

ABN , Publish Date - Oct 03 , 2025 | 10:13 PM

వచ్చే నెలలో జరగనున్న టోర్నమెంట్‌లో తాను బాగా ఆడాలని అమ్మ వారిని కోరుకున్నట్లు ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చెప్పారు. అంతకు ముందు దుర్గమ్మ ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ మర్యాదలతో ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

PV Sindhu: చాలా సంతోషంగా ఉంది: పీవీ సింధు
PV Sindhu

విజయవాడ, అక్టోబర్ 03: కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపారు. శుక్రవారం విజయవాడలో ఇంద్రకీలాద్రి శ్రీదుర్గమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువు తీరిన అమ్మవారిని కుటుంబ సమేతంగా పీవీ సింధు దర్శించుకున్నారు. అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ.. తాను ఎప్పుడు విజయవాడ వచ్చినా అమ్మవారిని దర్శించుకుంటానని చెప్పారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.


వచ్చే నెలలో జరగనున్న టోర్నమెంట్‌లో తాను బాగా ఆడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. అంతకు ముందు ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ మర్యాదలతో ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం పీవీ సింధుతోపాటు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి లడ్డూ ప్రసాదం, చిత్రపటాన్ని పీవీ సింధుకు ఆలయ అధికారులు ఇచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అత్యాచార నిందితులను నడి రోడ్డుపై లాక్కెళ్లిన పోలీసులు

నమ్మకం కుదిరింది: హీరో నాగార్జున

For More AP News And Telugu News

Updated Date - Oct 18 , 2025 | 04:27 PM