Lokesh Australia Visit: క్రీడా రంగంలో ఏపీ - ఆస్ట్రేలియా జట్టుకు లోకేష్ ప్రయత్నం
ABN , Publish Date - Oct 23 , 2025 | 10:18 AM
క్రికెట్, హాకీల్లో ఉమ్మడి శిక్షణా శిబిరాలు, ఫ్లెండ్లీ మ్యాచ్‌లు నిర్వహించాలని విక్టోరియా టూరిజం, స్పోర్ట్స్ మంత్రి స్టీవ్‌కు మంత్రి వినతి చేశారు.
ఆస్ట్రేలియా, అక్టోబర్ 23: రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఆస్ట్రేలియా పర్యటన ఐదవ రోజుకు చేరుకుంది. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో ఆర్థిక, విద్యా, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల కోసం వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి కీలక చర్చలు నిర్వహించారు. తాజాగా విక్టోరియా టూరిజం, స్పోర్ట్స్ మంత్రి స్టీవ్‌తో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. క్రికెట్, హాకీల్లో ఉమ్మడి శిక్షణా శిబిరాలు, ఫ్లెండ్లీ మ్యాచ్‌లు నిర్వహించాలని విక్టోరియా టూరిజం, స్పోర్ట్స్ మంత్రి స్టీవ్‌కు మంత్రి వినతి చేశారు.
అనంతరం టాస్మానియా వర్సిటీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల్లో పాఠ్య ప్రణాళికల అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సరఫరాపై ఉమ్మడి పరిశోధనలు చేపట్టాలని టాస్మానియా వర్సిటీ ప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ కోరారు. కాగా.. సిడ్నీ, మెల్బోర్న్, టాస్మానియా నగరాల్లో అనేక పరిశ్రమల ప్రతినిధులతో కూడా మంత్రి సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఏపీ అభివృద్ధి, ఉద్యోగావకాశాల సృష్టే లక్ష్యంగా మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
తుని అత్యాచార నిందితుడు నారాయణరావు ఆత్మహత్య
అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
Read Latest AP News And Telugu News