MLA Ramakrishna Reddy: ప్రధాని మోదీ పాలన ఒక సువర్ణ అధ్యాయం
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:46 PM
Modi Golden Chapter: జల జీవన్, ఆయుష్మాన్ భారత్, ఇలా అనేక కేంద్ర పథకాలతో ప్రధాని మోదీ పేదలకు మంచి చేస్తున్నారని, పర్యావరణాన్ని కాపాడటంలో గత ప్రభుత్వాలకు భిన్నంగా మోదీ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో రక్షణ రంగంలో ఎంత ప్రగతి సాధించామో ప్రపంచ దేశాలకు చాటి చెప్పామన్నారు.
Vijayawada: వికసిత్ భారత్‌కు అమృత కాలమని, పేదల సంక్షేమం, భారత దేశం (India) గౌరవం నిలబెడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Midi) పాలన కొనసాగుతోందని బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణా రెడ్డి (MLA Ramakrishna Reddy) వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కొరకు ప్రధాన ధ్యేయంగా పాలన ఉంటుందని, ఆర్థిక రంగంలో దేశాన్ని 4వ స్థానానికి నరేంద్రమోదీ తీసుకొచ్చారని కొనియాడారు. సేవా, సంక్షేమ కార్యక్రమాలతో ఆత్మ నిర్భర్ భారత్‌గా మోదీ పరిపాలిస్తున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు.
రాబోయే రోజుల్లో 3వ స్థానానికి...
జల జీవన్, ఆయుష్మాన్ భారత్, ఇలా అనేక కేంద్ర పథకాలతో ప్రధాని మోదీ పేదలకు మంచి చేస్తున్నారని, పర్యావరణాన్ని కాపాడటంలో గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో రక్షణ రంగంలో ఎంత ప్రగతి సాధించామో ప్రపంచ దేశాలకు చాటి చెప్పామన్నారు. మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా రక్షణ రంగంలో కావలసిన పరికరాలను మనం సమకూర్చుకున్నామని అన్నారు. చినాబ్ నదిపై సాంకేతిక పరిజ్ఞానంతో వంతెన నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో 3వ స్థానానికి రానుందని, నారీ వ్యవస్థలో మైనారిటీ మహిళలకు, మహిళలకు సమూచిత స్థానాన్ని కల్పించారని, ఆపరేషన్ సిందూర్‌లో ఇద్దరు మహిళలు నాయకత్వం వహించారని అన్నారు.
ప్రధాని మోదీ పాలన ఒక సువర్ణ అధ్యాయం..
సుదీర్ఘ కాలం తరువాత జనగణనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, కులగణన చేపట్టడం జరిగిందని, వీటిపై అవగాహన లేకుండా కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి విమర్శించారు. ప్రపంచ దేశాలకు భారత దేశాన్ని విశ్వగురు దేశంగా చూపించేలా ప్రధాని మోదీ చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం నాయకత్వం లేదని, దేశ అభివృద్ధిపై కాంగ్రెస్ అనవసరమైన ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూసేలా మోదీ చేశారన్నారు. ప్రపంచ రికార్డులలో అరుదైన రికార్డు సొంతం చేసుకునేలా మోదీ ప్రణాళికలు చేసారన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ సంఖ్యలో యోగా చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ యోగాలో భాగస్వామ్యం అవ్వాలని బీజేపీ పిలుపిచ్చిందన్నారు. డబల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని ప్రజలు మంచి విజయాన్ని అందించారన్నారు. అదే దిశగా పోలవరం, విశాఖ ఉక్కు కాపాడటం, రైల్వే జోన్, రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు వెళుతోందన్నారు. ప్రధాని మోదీ పాలన ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చునని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి:
తండ్రిపై కుమార్తె రోకలి బండతో దాడి
తల్లికి వందనం డబ్బులు పడలేదా..అయితే ఇలా చేయండి
మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు
For More AP News and Telugu News