YSRCP Legal Cell Lawyer: వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదిపై కేసు నమోదు
ABN , Publish Date - Nov 28 , 2025 | 10:57 AM
వైసీపీ లీగల్ సెల్ న్యాయవాది వెంకటేశ్ శర్మపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. విడాకుల కేసు మాట్లాడేందుకు వెళ్లిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు వెంకటేశ్ శర్మ.
విజయవాడ, నవంబరు28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ లీగల్ సెల్ న్యాయవాది వెంకటేశ్ శర్మ (YSRCP Legal Cell Lawyer Venkatesh Sharma)పై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. విడాకుల కేసు మాట్లాడేందుకు వెళ్లిన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు వెంకటేశ్ శర్మ. ఈ క్రమంలో ఆయనపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు. ఆమె ఫిర్యాదు మేరకు న్యాయవాది వెంకటేశ్ శర్మపై కేసు నమోదు చేశారు.
వెంకటేశ్ శర్మపై 75 (1)(i) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్ శర్మపై గతంలో వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీస్తున్నారు పోలీసులు. వెంకటేశ్ శర్మ మహిళలతో అసభ్యంగా ప్రవరిస్తునట్లు గుర్తించారు. పలు క్లబ్బుల్లో మహిళలపై కరెన్సీ విసిరి వేస్తున్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డబ్బు కట్టలతో వెంకటేశ్ శర్మ తీసుకున్న వీడియోలు కూడా వైరల్ కావటంతో విచారిస్తున్నారు మాచవరం పోలీసులు.
ఈ వార్తలు కూడా చదవండి..
పిఠాపురం మున్సిపాలిటీలో ఐదుగురు అధికారులపై వేటు వేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..
Read Latest AP News And Telugu News