CM Chandrababu Delhi Visit: సీఐఐ సదస్సు వేళ ఢిల్లీకి సీఎం, లోకేష్
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:27 AM
ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం ఐటీసీ మౌర్యలో జరిగే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలోముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొంటారు.
అమరావతి, సెప్టెంబర్ 30: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు CM Chandrabau Naidu), మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఈరోజు (మంగళవారం) ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామిక వేత్తలను సీఎం, లోకేష్ ఆహ్వానించనున్నారు. ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం ఐటీసీ మౌర్యలో జరిగే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలోముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొంటారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తోనూ ముఖ్యమంత్రి సమావేశంకానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి ఢిల్లీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్రమంత్రి నిర్మల, రాత్రి 8 గంటలకు హోంశాఖ మంత్రి అమిత్ షాలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. సాయంత్రం 5.30 గంటల నుంచి సీఐఐ సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. మంత్రి లోకేష్ మరికొద్ది సేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు.ఈ రోజు రాత్రికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీలోనే బస చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
విద్యుత్ ఛార్జీలపై గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి
220 కేవీ టవర్ ఎక్కిన వ్యక్తి.. భయాందోళనలో గ్రామస్తులు
Read Latest AP News And Telugu News