Chandrababu on Davos tour: అది నాకు కొత్త కాదు.. ఆ ట్రెండ్ సెట్ చేసింది నేనే
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:51 PM
CM Chandrababu: అప్పట్లో దావోస్‌కు వెళ్లినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నామని.. హైదరాబాద్ అని అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవారని.. పాకిస్థాన్‌లో ఉండే హైదరాబాద్ గురించా అని అడిగేవారని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పట్లో హైదరాబాద్‌లో సరైన ఎయిర్‌పోర్టు కూడా లేదన్నారు. దావోస్‌కు వెళ్లేందుకు ఇండియాలో పొలిటీషియన్స్ ఇష్టపడే వారు కాదన్నారు.

అమరావతి, జనవరి 25: ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) దావోస్ పర్యటన కొనసాగింది. వివిధ కంపెనీల దిగ్గజాలతో సీఎం సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు కూడా. విజయవంతంగా దావోస్ పర్యటన ముగించుకుని సీఎం స్వరాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా దావోస్ పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం మీడియాకు తెలియజేశారు. ‘‘దావోస్ అనేది నాకు కొత్త కాదు.. దావోస్‌కు వెళ్లాలని ట్రెండ్ చేసింది నేనే’’ అని అన్నారు. మొట్టమొదటి సారిగా 1995 ముఖ్యమంత్రి అయ్యాక.. 1997 నుంచి దావోస్‌కు వెళ్లినట్లు తెలిపారు.
అప్పట్లో దావోస్‌కు వెళ్లినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నామని.. హైదరాబాద్ అని అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవారని.. పాకిస్థాన్‌లో ఉండే హైదరాబాద్ గురించా అని అడిగేవారని అన్నారు. అప్పట్లో హైదరాబాద్‌లో సరైన ఎయిర్‌పోర్టు కూడా లేదన్నారు. దావోస్‌కు వెళ్లేందుకు ఇండియాలో పొలిటీషియన్స్ ఇష్టపడే వారు కాదన్నారు. నేను వెళ్లిన తర్వాతే బెంగళూరు నుంచి సీఎం ఎస్‌ఎమ్ కృష్ణ వచ్చారన్నారు. ఆయనతో అప్పట్లో నాకు పోటీ ఉండేదన్నారు. ‘‘మొన్నటి దావోస్ పర్యటనలో బిల్ గేట్స్ కూడా అప్పట్లో హైదరాబాద్‌ను మీరు ప్రమోట్ చేశారు కదా అని నాతో అన్నారు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేస్తున్నారు అని బిల్‌గేట్స్ నాతో అన్నారు’’ అని తెలిపారు. విధ్వంసానికి గురైన ఏపీని ప్రమోట్ చేసేందుకు ప్రతి వేదికను ఉపయోగించుకొంటున్నానని తెలిపారు.
అప్పుడు ఐటీ.. ఇప్పుడు ఏఐ యుగం
భవిష్యత్ అంతా గ్రీన్ ఇండస్ట్రీ, గ్రీన్ హైడ్రోజన్ మాత్రమే ఉంటుందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఉంటుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం భవిష్యత్‌లో బాగా ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు. ఏపీలో ఇప్పుడు 10 లక్షల మంది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ‘‘ప్రతి మీటింగ్‌లో నేను, లోకేష్ ప్రతీ వేదికపై ఏపీని ప్రమోట్ చేశాం. అప్పట్లో మేము హైటెక్ సిటీ స్టార్ట్ చేశాం. 1995లో ఐటీ, 2025లో ఏఐ యుగం అని నేను అందుకే చెప్పాను. నువ్వు ఉద్యోగం అడగడం కాదు... నువ్వు ఉద్యోగం ఇచ్చే స్థాయికి రావాలి. మొన్న నేను జూరిచ్ వెళ్ళినప్పుడు చాలా మంది 500 మంది తెలుగు వాళ్ళు వచ్చారు. అందులో చాలా మంది కంపెనీలు పెట్టారు. 100 దేశాల్లో తెలుగువాళ్ళు ఉన్నారు. రాబోయే ఐదేళ్లలో మన వాళ్ళు.. అన్ని దేశాలకు వెళతారు. సీఐఐతో కలిసి సింగపూరులోని ఐఎమ్‌బీని కలుపుకొని గ్లోబల్ లీడర్షిప్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. అమరావతిలోనే ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. మిగతా దేశాల్లో చాప్టర్‌లు ఉంటాయి. దావోస్ అంటే అందరు ఎన్ని ఎంవోయూలు చేశారని అంటారు.. అది క్రైటీరియా కాదు. దావోస్‌లో నాలుగు రోజులు ప్రపంచం మొత్తం వస్తుంది. అక్కడ మనం నెట్వర్కింగ్ చేసుకోవాలి... అక్కడ అనేక మంది సీఈఓ లు, కంపెనీల అధిపతులు వచ్చి కలిశారు’’ అని చంద్రబాబు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
TDP on Vijayasai: విజయసాయి రాజకీయ సన్యాసంపై టీడీపీ ఫస్ట్ రియాక్షన్
Vijayasai Reddy: ఎంపీ పదవికి రాజీనామా.. కూటమి నుంచి డబ్బులు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News