CRDA Amaravati development: సీఆర్డీఏ సమావేశం.. మరికాసేపట్లో వేల కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Mar 11 , 2025 | 04:23 PM
CRDA Amaravati development: రాజధాని అమరావతి పనులకు మరికాసేపట్లో గ్రీన్ సిగ్నల్ రాబోతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సీఆర్డీఏ సమావేశంలో వేల కోట్ల పనులకు ఆమోద ముద్ర పడనుంది.

అమరావతి, మార్చి 11: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షత సీఆర్డీఏ సమావేశం (CRDA Meeting) కొనసాగుతోంది. మంగళవారం నాడు అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో సీఆర్డీయే అధారిటీ 45వ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా అమరావతి రాజధాని (AP Capital Amaravati) పనులు మొదలుపెట్టేందుకు సీఆర్డీఏ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వబోతోంది. సుమారు 40 వేల కోట్ల విలువైన పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు అధారిటీ ఆమోదం తెలుపనుంది. అధారిటీ ఆమోదం పొందగానే ఆయా ఏజెన్సీలతో సీఆర్డీయే ఒప్పందాలు చేసుకోనుంది.
సీఆర్డీఏతో ఒప్పందాలు చేసుకున్నాక రాజధానిలో ఒకేసారి పెద్దయెత్తున పనులను ప్రారంభించేందుకు ఏజెన్సీలు సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశానికి మంత్రి నారాయణ (Minister Narayana), మున్సిపల్ శాఖ , సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. రాజధాని పనులకు సంబంధించి ఈ అధారిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దాదాపు 40 వేట కోట్ల విలువైన పనులను ఏజెన్సీలు ఇప్పటికే దక్కించుకున్నాయి. వాటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు అధారిటీ నేడు ఆమోదముద్ర వేయనుంది. ఆమోదం లభించిన వెంటనే సీఆర్డీఏతో ఏజెన్సీలు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత రాజధానిలో పెద్ద ఎత్తున పనులు మొదలుపెట్టనున్నారు.
Special Needs Schools: ఏపీలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు
ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు కలిసి రూ.13వేల 400 కోట్ల రుణాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. హడ్కో నుంచి మరో రూ.11వేల కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రం నుంచి అంగీకారం తెలుపుతూ ముంబైలోని హడ్కో కార్యాలయానికి లేఖ పంపారు. అలాగే జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరో రూ.5వేల కోట్లు రుణాలు తీసుకోవడంతో పాటు రూ.1500 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్‌గా తీసుకోనున్నారు. మొత్తం రూ.31వేల కోట్ల నిధులు ప్రభుత్వం వద్ద అమరావతి నిర్మాణానికి సంబంధించి సిద్ధంగా ఉన్నాయి.
దీనిలో భాగంగా అమరావతికి సంబంధించి పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఈరోజు (మంగళవారం) ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారాయణ ప్రకటించారు. లాండ్ పూలింగ్ స్కీమ్ కింద రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్‌లో రోడ్లు, ఇతర పనులను మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ఇక రెండేళ్లలో పెద్ద రోడ్లను పూర్తి చేస్తామని.. సెక్రటేరియట్, అసెంబ్లీ వంటి ఐకానిక్ టవర్స్‌ను కూడా మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. వీటిన్నింటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయిన నేపథ్యంలో రూ.40 వేల కోట్ల పనులకు సంబంధించి అనుమతించే పత్రాలను ఆయా కంపెనీలకు అందజేయడం, సీఆర్డీఏ ఒప్పందాలకు ఈరోజు జరిగే సీఆర్డీఏ సమావేశం కీలకంగా మారనుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా వీలైనంత తొందర్లో అమరావతిలో పనులను ప్రారంభంకానున్నాయి.
ఇవి కూడా చదవండి...
Aadudam Andhra Scam: ఆడుదాం ఆంధ్రాపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
Vamsi Case Update: వంశీ కేసు.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
Read Latest AP News And Telugu News