Vamsi Case Update: వంశీ కేసు.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:37 PM
Vamsi Case Update: సత్యవర్ధన్‌ను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో వర్చువల్‌గా వంశీని న్యాయాధికారి ఎదుట జైలు అధికారులు హాజరుపర్చారు.

విజయవాడ, మార్చి 11: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపు కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Former MLA Vallabhaneni Vamsi) మరో షాక్ తగిలింది. వల్లభనేని వంశీ రిమాండ్‌ను పొడిగించింది కోర్టు. ఈనెల 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఆదేశించారు. నేటితో వంశీ రిమాండ్ ముగియడంతో జైలు నుంచి వర్చువల్‌గా న్యాయాధికారి ముందు హాజరుపర్చారు జైలు అధికారులు. ఈ క్రమంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఈనెల 25 వరకు వంశీ రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయాధికారి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
కాగా.. ఈకేసులో వంశీతో పాటు మరో ఐదుగురు జిల్లా జైలులో ఉన్నారు. వంశీని పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఇటీవల పోలీసులు పిటిషన్ వేయగా.. కోర్టు మూడు రోజులు మాత్రమే కస్టడీకి ఇచ్చింది. అయితే విచారణలో వంశీ ఏమాత్రం సహకరించలేదని పోలీసులు తెలిపారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటి వేసిన నేపథ్యంలో మరోసారి పదిరోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు పోలీసులు. దీనిపై రెండు రోజుల పాటు వాదనలు జరిగాయి. అయితే మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వడం, అనారోగ్య కారణాల నేపథ్యంలో పోలీసులు వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బ్యారక్ మార్చాలంటూ వంశీ వేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు.. బ్యారక్ మార్చడం సాధ్యంకాదని కోర్టు స్పష్టం చేసింది. అయితే అనారోగ్య కారణాల వల్ల దిండు, దుప్పటి ఇచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇక కస్టడీ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ఇప్పుడు కేవలం బెయిల్ పిటిషన్‌పై మాత్రమే ఎస్సీ, ఎస్టీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒకసారి వాదనలు జరుగగా.. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం మొత్తం వంశీ కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు అనేక సాక్షాలను సేకరించారని, మళ్లీ బెయిల్ ఇస్తే పూర్తిగా సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. అనారోగ్య కారణాల వల్ల బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరపు న్యాయవాదులు వాదించారు. ఇప్పటికే రెండు సార్లు రిమాండ్ పొడిగించిన తరుణంలో అతడికి బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు. అయితే దీనికి సంబంధించి రేపు (బుధవారం) మరోసారి వాదనలు విన్నాక కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా నేటితో వంశీ రిమాండ్ ముగియడంతో వంశీని జిల్లా జైలు నుంచే వర్చువల్ విధానంలో న్యాయాధికారి ఎదుట హాజరుపర్చారు. ఈనెల 25 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రేపు బెయిల్‌పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
IT Raids: దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై రెండో రోజు ఐటి సోదాలు
Police Complaint Against Duvvada: వరుస కేసులు.. నెక్ట్స్ దువ్వాడేనా
Read Latest AP News And Telugu News