Share News

CM Chandrababu On Tirumala Brahmotsavams: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సీఎం చంద్రబాబు ట్వీట్

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:49 AM

బ్రహ్మోత్సవాలపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. ఉత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ సేవను టీటీడీ ఎంతో అద్భుతంగా నిర్వహించిందని.. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి అన్నారు.

CM Chandrababu  On Tirumala Brahmotsavams: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సీఎం చంద్రబాబు ట్వీట్
CM Chandrababu On Tirumala Brahmotsavams

అమరావతి, సెప్టెంబర్ 29: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavams)అంగరంగా వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని ఆ శ్రీవారిని దర్శించుకుని పుణీతులయ్యారు. ఇదిలా ఉండగా.. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ అద్భుతం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కొనియాడారు. బ్రహ్మోత్సవాలపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. ఉత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ సేవను టీటీడీ ఎంతో అద్భుతంగా నిర్వహించిందని.. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు.


tirumala-2.jpg

చంద్రబాబు ట్వీట్ ఇదే..

‘తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీ మలయప్ప స్వామి వారి గరుడ వాహన సేవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి అభినందనలు. ఆదివారం నాటి పరమ పవిత్ర గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి తరలివచ్చిన 3 లక్షల మందికిపైగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారికి మంచి అనుభూతిని మిగిల్చారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించి, సమన్వయంతో వ్యవహరించిన టీటీడీ బోర్డుకు, దేవస్థానం అధికారులకు, ఉద్యోగులకు, శ్రీవారి సేవకులకు, జిల్లా అడ్మినిస్ట్రేషన్‌కు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు, ఆ శాఖ సిబ్బందికి అభినందనలు. తిరుమల కొండ పవిత్రతను కాపాడుతూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించిన భక్త కోటికి ధన్యవాదాలు’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

tirumala.jpg


tirumala.jpg

ఇవి కూడా చదవండి..

బాసరలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

సరస్వతీ దేవిగా దుర్గమ్మ.. కిలో మీటర్ల మేర క్యూలైన్లో భక్తులు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 29 , 2025 | 03:19 PM