AP Cabinet: ఏపీ కేబినెట్.. రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Dec 11 , 2025 | 02:02 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.
అమరావతి, డిసెంబర్ 11: ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈరోజు (గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి.. నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 44 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్‌భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అదే విధంగా గవర్నర్ కార్యాలయం, గెస్ట్ హౌస్‌లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గ సమావేశంలో చర్చించి అంగీకారం తెలిపారు. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.
కీలక నిర్ణయాలు ఇవే..
సీడ్ యాక్సెస్ రహదారిని 16వ హైవేకి అనుసంధాన పనులకు రూ.532 కోట్లకు కేబినెట్ ఆమోదం.
కుప్పంలో పాలేరు నదిపై చెక్‌డ్యామ్‌ల నిర్వహణకు పరిపాలన అనుమతుల మంజూరుకు ఓకే
గిరిజన సంక్షేమశాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతికి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కేబినెట్‌లో చర్చ, ఆమోదం
ఎస్‌ఐపీబీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదం
రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 26 సంస్థలకు ఏపీ కేబినెట్ ఆమోదం
ఇవి కూడా చదవండి...
ఏపీలో చంద్రబాబు పాలనపై మోదీ కితాబు
సుప్రీం ఆదేశం.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్
Read Latest AP News And Telugu News