Modi Praises Chandrababu: ఏపీలో చంద్రబాబు పాలనపై మోదీ కితాబు
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:00 PM
ఏపీలో చంద్రబాబు పాలనను ప్రధాని మోదీ పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు పాలన చాలా బాగుందని ప్రధాని ప్రశంసించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఏపీలో పాలనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు (CM Chandrababu) పాలన భేష్ అంటూ కితాబిచ్చారు. ఈరోజు (గురువారం) ఉదయం ఏపీ , తెలంగాణ ఎన్డీయే ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో చంద్రబాబు పాలన చాలా బావుందని ప్రశంసించారు. పెట్టుబడులు కూడా ఏపీకి ఎక్కువగా వస్తున్నాయని ప్రధాని వెల్లడించారు.
అయితే ఏపీలో పాలనను పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని.. తెలంగాణ బీజేపీ ఎంపీలపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని ఫైర్ అయినట్లు సమాచారం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని ఎంపీలకు ప్రధాని మోదీ హితవుపలికారు.
ఈరోజు ఉదయం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలకు ప్రధాని మోదీ అల్పాహార విందు ఇచ్చారు. ఎంపీలతో సుమారు అరగంట పాటు మోదీ మాట్లాడారు. ఏపీలో చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని, ఆయన పాలన కూడా బేషుగ్గా ఉందని కొనియాడారు. పూర్తి సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. చంద్రబాబు పరిపాలనపై కూడా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని ప్రధాని కితాబిచ్చారు. ఏపీకి ఎక్కువగా పెట్టుబడులు వెళ్తున్నాయని.. ఇది శుభపరిణామమన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రధాని పేర్కొన్నారు. అలాగే జగన్ పార్టీని, సోషల్ మీడియాలో ఆ పార్టీ చేస్తున్న విమర్శలకు బీజేపీ నేతలు కూడా ధీటుగా కౌంటర్ ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.
అటు తెలంగాణలో ఓవైసీ సోషల్ మీడియా కంటే బీజేపీ సోషల్ మీడియా చాలా తక్కువగా ఉందని, బీజేపీ నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఎందుకు ఉండటం లేదని తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని, కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించడం లేదని ఎంపీలపై మండిపడినట్లు తెలుస్తోంది. మంచి టీమ్‌ను పెట్టుకుని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉన్నా కూడా సమస్య ఏంటి అని ప్రశ్నించినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ పెరగడానికి మంచి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలం అవుతున్నారని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
సుప్రీం ఆదేశం.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్
పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ప్రవేశపెడతాం.. పెమ్మసాని కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News