SKU Irregularities AP Assembly: ఎస్కేయూలో అక్రమాలు.. చర్యలు తప్పవన్న మంత్రి లోకేష్
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:18 PM
ఎస్కేయూలో అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయని.. దీనిపై విచారణ కమిటీ వేశామని... నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని లోకేష్ చెప్పారు. ఎస్కేయూలో నిన్న ఓ విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయారని.. కానీ దాన్ని రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి, సెప్టెంబర్ 26: ఏపీ శాసనసభలో (AP Assembly Session) ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నిధుల దుర్వినియోగంపై ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు ప్రశ్నించారు. 2019-24 మధ్య యూనివర్సిటీలను వైసీపీ కార్యాలయాలుగా మార్చారని మండిపడ్డారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఎస్కేయూ వైస్ ఛాన్సలర్ బెదిరించేవారని తెలిపారు. రోస్టర్ విధానం పాటించకుండా 25 పోస్టులు భర్తీ చేశారని తెలియజేశారు. గతంలో కుసుమ కుమారి హయాంలో అక్రమ నియామకాలు చేశారని ఆరోపించారు. రిజర్వేషన్లు పాటించని కారణంగా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగిందనన్నారు.
కూటమి ప్రభుత్వంలో సమర్థులకు వీసీ బాధ్యతలు అప్పగించారన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కోరారు. ఎస్కేయూలో నియామకాల విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని ఎమ్మెల్యే పల్లె సింధూర తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పడిపోయిన ప్రమాణాలు పెంచటం కోసం ఏమైనా చర్యలు తీసుకున్నారా ఎమ్మెల్యే ప్రశ్నించారు.
మంత్రి నారా లోకేష్ సమాధానం
ఎస్కేయూలో అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయని.. దీనిపై విచారణ కమిటీ వేశామని... నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్కేయూలో నిన్న ఓ విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయారని.. కానీ దాన్ని రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలో తరగతులకు ఆటంకం కలిగించటం సరికాదన్నారు. అందరం కలిసికట్టుగా ఉన్నత విద్యను బాగు చేసుకోవాలనదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఆంధ్రా యూనివర్సిటీని ప్రపంచంలో టాప్ 100లో తీర్చి దిద్దాలనేది సీఎం లక్ష్యమని వెల్లడించారు. డిగ్రీ కళాశాలలో సంప్రదాయ కోర్సులకు ఆదరణ తగ్గిందన్నారు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులు ప్రభుత్వ కాలేజీల్లో ప్రారంభిస్తామని తెలిపారు. కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని.. న్యాయపరమైన ఇబ్బందులు అధిగమించి తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అతిభారీ వర్షాలు.. తీర ప్రాంతాలకు అలెర్ట్
పాలిటెక్నిక్ భవనాలపై అసెంబ్లీలో చర్చ
Read latest AP News And Telugu News